జగన్ దగ్గరకు ఇద్దరు రెడ్ల పంచాయతీ

Kotamreddy Sridhar reddy and Kakani issue going to Jagan

ఎంపిడిఓ సరళ ఇంటిపై దౌర్జన్యం చేసిన కేసులో వైసిపికి చెందిన నెల్లూరు రూరల్ ఎంఎల్ఏ కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడం తర్వాత జరిగిన పరిణామాలతో వైసీపీలో కలకలం రేగింది, అయితే సొంత పార్టీలో పక్క సెగ్మెంట్లో నేతలు ఇలా కోట్లాటకు దిగడం, పైగా ఇద్దరూ జగన్ కు బాగా కావలసిన వారు కావడంతో ఈ పంచాయతీ సీఎం జగన్ దగ్గరకు వస్తున్నట్లు తెలుస్తోంది.

బుధవారం సాయంత్రం క్యాంప్ ఆఫీసులో నెల్లూరు నేతలతో సీఎం భేటీ కానున్నారు అని తెలుస్తోంది. నెల్లూరు జిల్లా నేతల మధ్య విభేదాలు, ఆధిపత్య పోరుపై జగన్ సీరియస్ అయ్యారు. పార్టీ, ప్రభుత్వ వ్యవహారాల్లో నేతల మధ్య సమన్వయ లోపంపై చర్చించనున్నారు. ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, కాకాణిగోవర్ధన్ రెడ్డి తీరుపై జగన్ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే సొంత పార్టీ నేతలు ఇలా అలకబూనడం పై పెద్ద ఎత్తున విమర్శలు ఆరోపణలు వస్తున్నాయి.
కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, ఆయన అనుచరుడు బిరదవోలు శ్రీకాంత్రెడ్డి తన ఇంటిపై దాడిచేశారని, దౌర్జన్యం చేశారని వెంకటాచలం ఎంపీడీవో సరళ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ వ్యవహరం పెద్ద మైనస్ అయింది…దీంతో శ్రీధర్రెడ్డి, శ్రీకాంత్రెడ్డిలపై ఐపీసీ సెక్షన్లు 290, 427, 448, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇక టీడీపీ అవకాశం కోసం చూడటంతో దీనిని హైలెట్ చేయాలని భావించింది, కాని సీఎం జగన్ మాత్రం దీనిపై ఆయనే కీలక నిర్ణయం తీసుకున్నారు.

Latest Updates

More...

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.