వైసీపీలోకి ఎవరూ ఊహించని నేత

KVP

వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచారు.. ఇక ఆయన గెలుపు నల్లేరు మీద నడక అవుతుంది అని అందరూ అనుకున్నారు. చివరకు అలాగే వచ్చింది. తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఇలాంటి ఓటమి వచ్చింది అని ఆలోచనలో ఉంది. అయితే వైసీపీలో ఇప్పుడు పదవుల పందారం జరుగుతోంది. కేబినెట్ కూర్పుతో బీజీగా ఉన్నారు జగన్, అలాగే జగన్ ను వీడి వేరే పార్టీలవైపు చూసిన నేతలు ఇప్పుడు జగన్ కాంపాండ్ లోకి రావాలి అంటే నామోషీగా ఫీల్ అవుతున్నారు, ఇక జగన్ కూడా అలాంటి వారిని పట్టించుకోవడం లేదు. గెలిచిన వారితోనే అంతా ఇప్పుడు సంప్రదింపులు ఇక అభివృద్దిపై ఫుల్ ఫోకస్ పెట్టారు ఆయన.

తాజాగా వైసీపీలోకి ఓ కీలక నేత చేరుతున్నారు అని వార్తలు వస్తున్నాయి.. జగన్ కు సలహాలు సూచనలు ఇవ్వడానికి చాలా మంది ఉన్నారు. పైగా నాటి వైయస్ కేబినెట్ లో 70 శాతం నేతలు జగన్ దగ్గర ఉన్నారు. అలాగే అధికారులు కూడా జగన్ కు ఇప్పుడు వెన్నంటి ఉన్నారు. ఏపీలో జగన్ మార్క్ చూపించేలా జగన్ పథకాలు కూడా ప్రజల్లోకి తీసుకువెళుతున్నారు. ఈ సమయంలో వైసీపీలో చేరనున్న ఆ నేత ఎవరు అనేది చర్చ జరుగుతోంది.

అతను మరెవ్వరో కాదు సాక్ష్యాత్తు దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మగా చెప్పబడే కేవీపీ రామ చంద్రారావు. రాజకీయంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్దితి ఎలా ఉందో తెలిసిందే,పైగా ఆయన ఏపీలో జరగవలసిన అభివృద్ది గురించి పోలవరం గురించి పలు సార్లు మీడియా ముఖంగా చంద్రబాబుపై విమర్శలు చేశారు. ఇక ఇప్పుడు జగన్ అధికారంలోకి రావడంతో ఆయన జగన్ సమక్షంలో వైసీపీలో చేరాలి అని భావిస్తున్నారట.
ఇక ఆయన జగన్ దగ్గర ఉంటే పార్టీలో మరింత శక్తి పెరుగుతుంది ఆయనకు రాజకీయంగా మంచి సలహాలు ఇస్తారు.. జగన్ కు కూడా రాజకీయంగా మంచి బలం తోడవుతుంది అంటున్నారు పార్టీ శ్రేణులు, మరి ఆ చేరే ముహూర్తం ఎప్పుడు అనేది చూడాలి.

Latest Updates

More...

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.