janampulse

తెలంగాణ సీఎం కేసీఆర్ జీవితంలో కీల‌క విష‌యాలు త‌ప్ప‌క తెలుసుకోండి

Learn the key things in life of Telangana CM KCR

తెలంగాణ ముద్దు బిడ్డ, అప‌ర‌భ‌గీర‌ధుడు, తెలంగాణ స‌మాజానికి అభివృద్దికి బ్రాండ్ అంబాసిడ‌ర్ కేసీఆర్ అంటారు తెలంగాణ ప్ర‌జ‌లు.. అందుకే ఉద్య‌మ‌నాయ‌కుడిని ఏకంగా సీఎంగా కూర్చొబెట్టిన ఘ‌న‌త తెలంగాణ ప్ర‌జ‌ల‌కే ద‌క్క‌తుంది. ఇక్క‌డ ఆయ‌న ప‌ట్ల ప్ర‌జ‌లు అంతే ఎత్తున అభిమానం చూపిస్తారు. నాడు పోరాటం చేశాడు నేడు ప‌రిపాల‌న చేస్తున్నారు కేసీఆర్.. ఆయ‌నే ప్రియ‌త‌మ నేత శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. రెండోవ‌సారి ముఖ్య‌మంత్రిగా తెలంగాణ‌లో అధికారం చేప‌ట్ట‌బోతున్న సీఎం గురించి ఆయ‌న జీవితంలో కొన్ని ముఖ్య ఘ‌ట్టాల గురించి తెలుసుకుందాం.

1954 ఫిబ్రవరి 17 న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ,నేటి తెలంగాణ రాష్ట్రం, మెదక్ జిల్లాలో ని , చింతమడక గ్రామంలో రాఘవరావు, వెంకటమ్మ దంపతులకు జన్మించాడు కేసీఆర్. ఆయన వయస్సు 64 యేళ్లు.చంద్రశేఖర్ రావు కుటుంబం ఎగువ మానేరు డ్యాం నిర్మాణంలో భూమి కోల్పోయి చింతలమడక గ్రామానికి వచ్చి స్థిరపడింది. దీనివల్ల ఈయన చిన్నతనంలో మధ్యతరగతి జీవితం అనుభవించాడు.ఆయ‌న సిద్ధిపేట డిగ్రీ కళాశాలలో చరిత్ర, రాజనీతి శాస్త్రం, తెలుగు సాహిత్యం సబ్జెక్టులుగా బి.ఎ. పూర్తిచేసి,ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎం.ఎ (తెలుగు సాహిత్యం) చదివారు.

విద్యార్థి దశలో ఉన్నప్పుడే చంద్రశేఖర్ రావు రాజకీయాల్లో చురుకుగా ఉండేవారు. విద్యార్థి సంఘం అధ్యక్ష పదవికి పోటీచేసి ఓడిపోయాడు. విద్యార్థి దశ నుంచే కేసీఆర్‌కి రాజకీయ రంగంలోకి వెళ్ళాలనే స్పష్టత ఉండేది. అప్పటి కాంగ్రెస్ నాయకుడు అనంతుల మదన్ మోహన్ కేసీఆర్ కి రాజకీయ గురువు. 1975లో దేశంలో అత్యవసర స్థితి విధించగానే డిగ్రీ పూర్తిచేసిన కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళి సంజయ్ విచార్ మంచ్‌లో చేరారు.. 1980లో సంజయ్ గాంధీ మరణించాకా సిద్ధిపేట తిరిగిచ్చారు.. 1982లో తాను ఎంతగానో అభిమానించే నందమూరి తారక రామారావు పార్టీ పెట్టడంతోనే కాంగ్రెస్‌కు రాజీనామా చేసి, తెలుగుదేశం పార్టీలో చేరారు.

కేసీఆర్ 1969 ఏప్రిల్ 23న శోభను వివాహమాడారు. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె. కేసీఆర్ కుమారుడు కల్వకుంట్ల తారక రామారావు, కుమార్తె కల్వకుంట్ల కవిత తెలంగాణ సాధన కోసం ఉద్యమాల్లో వీరు ఇద్ద‌రూ కూడా పాల్గొన్నారు..రాష్ట్ర ఏర్పాటు అనంతరం కుమారుడు తారక రామారావు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రివర్గంలో చేరగా, కుమార్తె కవిత పార్లమెంటు సభ్యురాలైంది.

ముక్కు సూటి తత్వం గల నాయకుడు అనుకున్నది అనుకున్నట్లుగా చేయడంలో వెనుకంజ వేయరు. ఆయన రాజకీయ జీవితం లో ఎన్నో ఎన్నో గొప్ప ఆవిష్కరణలు ఉన్నాయి. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడంలో కృత నిశ్చయుడు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన పాత్ర అనిర్వచీయమైనది. చరిత్ర లో నిలిచిపోయే రీతిలో ఆయన స్వరాష్ట్ర సాధనకు ఉద్యమించి సాధించి పెట్టారు.

తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు. కెసిఆర్ అన్న పొడి అక్షరాలతో సుప్రసిద్ధుడు అయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డాక రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడైన చంద్రశేఖరరావు 15వ లోక్‌సభలో అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లోని కరీంనగర్ నియోజకవర్గం లో ప్రాతినిధ్యం వహించారు. 2004 నుండి 2006 వరకు కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 15వ లోక్‌సభలో మహబూబ్ నగర్ నియోజకర్గంలో నుండి విజయం సాధించారు..కేసీఆర్ 2001 లో స్థాపించిన రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. ఈ పార్టీ నుంచి ముఖ్యమంత్రి గా చరిత్ర సృష్టించారు.

ఈయన మొదట తెలుగుదేశం పార్టీలో సభ్యుడు. తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేక రాష్ట్రం సాధన ధ్యేయంగా ఆ పార్టీ నుండి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించారు. 2004 సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ తో కలిసి పోటీచేసి 5 లోక్‌సభ స్థానాలను దక్కించుకున్నారు. అయితే తరువాతి కాలంలో యు.పి.ఏ నుండి వైదొలిగారు.

ఆయన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా జూన్ 2 మధ్యాహ్నం 12.57 కు ప్రమాణ స్వీకారం చేసారు. ఆయన జ్యోతిష శాస్త్రాన్ని, సంఖ్యాశాస్త్రాన్ని మరియు వాస్తును నమ్మే వ్యక్తిగా పండితులు చెప్పిన ప్రకారం లక్కీ నంబర్ “ఆరు” అయినందున ఈ సమయాన్ని ప్రమాణ స్వీకారానికి ఎంచుకున్నారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరుతూ గత 50 సంవత్సరాలనుండి పలు ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి, కానీ 2001 లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పడిన తర్వాత ఇవి తీవ్ర రూపం దాల్చాయి. ఇందులో భాగంగా టీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గా శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 2009, నవంబర్ 29న దీక్షా దివస్ పేరుతో నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కేసీఆర్ నిరాహారదీక్ష కీలక ఘట్టం చేరుకుంది.

2009 నవంబరు 29న కేసీఆర్ ఖమ్మం పట్టణంలో తెలంగాణ సాధన లక్ష్యంగా ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. అదే రోజున పోలీసులు దీక్ష భగ్నం చేసి ఖమ్మం సబ్ జైలుకు తరలించి 29, 30 తేదీల్లో బంధించారు. 30న జైల్లోనే నిరాహార దీక్ష కొనసాగించడంతో అక్కడ నుంచి ప్రభుత్వాసుపత్రికి కేసీఆర్‌ని తరలించారు.అయితే…..స్వరాష్ట్రం కోసం 2009 డిసెంబరు 3వ తేదీన ప్రాణత్యాగం చేసిన తొలి అమరుడు కాసోజ్ శ్రీకాంత్ చారి ఆ తర్వాత కూడా చాలా మంది విద్యార్థులు అమరులు అయ్యారు . ప్రొఫెసర్ కోదండరాం ఆధ్వర్యంలో ఏర్పడిన తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణసమితి ఆధ్వర్యంలో వివిధ ఉద్యమాలని రూపొందించారు, సకలజనుల సమ్మె, మిలియన్ మార్చి వీటిలో చెప్పుకోదగినవిగా మారాయి. ఈ ఉద్యమాల ఫలితంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ ప్రభుత్వమి 2009 డిసెంబరు 9 న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రారంభమైందని అధికారికంగా ప్రకటించింది.ఈ నిర్ణయంపై సీమాంధ్ర ప్రాంతంలో నిరసనలు మిన్నంటి సమైక ఆంధ్రా ఏర్పాటుకు పరిస్థితులు దారితీసాయి. ఆ విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.

ఆయ‌న రాజ‌కీయాల్లో అధిరోహించి న ప‌దవులు ఓసారి చూసిన‌ట్టు అయితే
1985-2004 :ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుడు (4 సార్లు)
1987-88 : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో సహాయక మంత్రి.
1992-93 : అధ్యక్షుడు, కమిటీ ఆన్ పబ్లిక్ అండర్ టేకింగ్స్.
1997-99 : ఆంధ్ర ప్రభుత్వంలో కేబినెట్ మంత్రి.
1999-2001 : ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో ఉప సభాపతి
2001 ఏప్రల్ 21 :తెలుగుదేశం పార్టీకి డిప్యూటి స్పీకర్ పదవికి రాజీనామా.
2001 ఏప్రల్ 27 : తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపన.
2004 : 14 వ లోక్ సభ సభ్యునిగా ఎన్నిక.
2004-06 : కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రి.
సెప్టెంబరు 23, 2006 : లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా…
డిసెంబరు 7, 2006 : 14 వ లోక్ సభ ఉప ఎన్నికలో మరల ఎన్నిక.
మార్చి 3, 2008 : లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా
2009 : 15 వ లోక్ సభ సభ్యునిగా ఎన్నిక
(2వ సారి) లోక్ సభలో తెలంగాణ రాష్ట్రసమితి పార్లమెంటరీ పార్టీ నాయకుడు.
సెప్టెంబరు 23, 2009 : రూల్స్ కమిటీలో సభ్యులు
2014: తెలంగాణ రాష్ట్ర శాసన సభ్యునిగా ఎన్నిక
2014 : తెలంగాణ రాష్ట్రం శాసన సభా పక్ష నాయకునిగా ఎన్నిక.
2014, జూన్ 2 : తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం.
2018 డిసెంబ‌ర్ 11న తెలంగాణ ఫ‌లితాల్లో టీఆర్ఎస్ రెండోసారి ప్ర‌భుత్వ ఏర్పాటు.

ఈ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన టీఆర్ఎస్ శ్రేణుల‌కు, కేసీఆర్,కేటీఆర్, హ‌రీష్ రావుల‌కు మా జ‌నంప‌ల్స్ మీడియా త‌ర‌పున హృద‌య‌పూర్వ‌క అభినంద‌నలు

విశ్లేష‌ణ‌!! వీజీ
మీ జ‌నంప‌ల్స్ టీమ్

Recent News

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.