రోజా రివేంజ్ అదిరిపోయింది నాడు అలా నేడు ఇలా

roja

అది 2015, డిసెంబర్ 18. ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరగుతున్న సమయం. అప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది వైసీపీ నేతలకు ప్రతిపక్ష హోదా ఉన్నా వారికి మాట్లాడే అవకాశం ఇవ్వని రోజులు అవి ఆ రోజు విజయవాడ కాల్ మనీ వ్యవహరం పైన విపక్ష వైసీపీ సభలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోంది. ఇది తెలుగుదేశం పార్టీకి చాలా ఇబ్బందికి గురి చేసింది అంతే కాదు మీడియా కూడా దీనిని బాగా హైలెట్ చేసింది ఇదే విషయం పై వైసీపీ నుండి మహిళా సభ్యురాలు రోజా సభలోనే ఉన్న ముఖ్యమంత్రి పైన కొన్ని కామెంట్లు చేసారు. ఇక రోజాపై ఏనాటి నుంచో వేటు వేయాలి అని చూసిన తెలుగుదేశం అవకాశం కోసం చూశారు. చిక్కిన అవకాశం వదులుకోకూడదు అని వెంటనే ఆమెపై వేటు వేశారు.

శాసన సభలో శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి యనమల రామకృష్ణుడు రోజాను ఏడాది పాటు సభ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు సభలో ప్రతిపాదించారు. ఆ వెంటనే స్పీకర్ కోడెల శివ ప్రసాద్ వెంటనే మూడ్ ఆఫ్ ది హౌస్ నిర్ణయంగా రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.ఇక ఆమెని మాత్రం దీనిపై సమాధానం కూడా చెప్పడానికి అవకాశం ఇవ్వలేదు స్సీకర్ ఏకంగా సంవత్సరం పాటు సభనుంచి ఆమెని అన్యాయంగా బయటకు పంపించారు నాడు తెలుగుదేశం నేతలు. ఇదంతా వైసీపీని కాల్ మనీ సెక్స్ రాకెట్ గురించి మాట్లాడనివ్వకుండా చేయడానికి చేసిన టార్గెట్ అనేది తేలిపోయింది.

తనను ఏకపక్షంగా అన్యాయంగా ఏడాది పాటు సభ నుండి సస్పెండ్ చేయటం పట్ల ఎమ్మెల్యే రోజా హైకోర్టును ఆశ్రయించారు. కాని కోర్టు తీర్పు ఇక్కడ చెల్లదు అని స్పీకర్ తెలియచేశారు. ఆమెని సభలోకి రానివ్వకుండా అక్కడ అధికారులకు స్పీకర్ ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఆమె కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చినా అసెంబ్లీకి రాలేదు. సంవత్సరం అయినా సరే సస్పెన్షన్ గుడువు అయినా మీకు అనుమతి లేదు అని ఆమెని ఆపేశారు..ఇక తర్వాత వైసీపీ అధినేత అసెంబ్లీకి వెళ్లలేదు ఫిరాయింపుల విషయంలో ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టలేదు. ఇక పాదయాత్రకు వెళ్లారు ఆయన, అప్పటి నుంచి వైసీపీ నేతలు ఎవరూ కూడా అసెంబ్లీకి వెళ్లలేదు.

మూడున్నారేళ్ల క్రితం ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా బహిష్కరణకు గురైన రోజా..తిరిగి నేడు అధికార పార్టీ ఎమ్మెల్యేగా సభ లో అడుగు పెట్టారు, మొత్తానికి నాడు చంద్రబాబు సర్కార్ చేసిన పనికి ఆమె చాలా బాధపడ్డారు.. కన్నీరు పెట్టుకున్నారు. చివరకు తెలుగదేశం పార్టీకి ఆ ప్రభుత్వానికి ఇలాంటి పరిస్ధితి వచ్చింది.. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఆమె అధికారం పక్షం వైపు ఉంటే ఇదే సభలో అవమానించిన వారు ప్రతిపక్షంలో ఉన్నారు. విధి చాలా బలీయమైనది. సమయం ఎప్పుడూ ఒకరివైపే ఉండదు అనేది తెలుసుకోవాలి.

విశ్లేషణ – వీజీ

Latest Updates

More...

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.