భారీగా ఐఏఎస్ ల బదిలీలు జగన్ కొత్త టీం రెడీ

Major IAS transfers will be jagan new team

మరో ఐదు రోజుల్లో జగన్ తన కోర్ టీం సిద్దం చేసుకోనున్నారు.. 30 న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే సమయానికి ఆయన కోరుకున్న అధికారులు ఆయన కోటరిలో ఉండనున్నారు అని తెలుస్తోంది. ఇక బాబుకు సన్నిహితులుగా ఉండి వైసీపీ పై అక్రమ కేసులు పెట్టడానికి కారణం కొందరు ఉన్నత అధికారులు అనేది తెలిసిందే, విజయసాయిరెడ్డి అయితే ఇంటెలిజెన్స్ చీఫ్ వెంకటేశ్వరరావుపై విమర్శలు కూడా నేరుగా చేశారు. ఇక ఇలాంటి సమయంలో కొత్త ప్రభుత్వంలో కొందరు అధికారులు మార్పు అవసరం అని భావించారు జగన్. ఇప్పుడు ఇది ప్రభుత్వ వర్గాలలో కూడా చర్చజరుగుతున్న అంశం.

ఇప్పటికే దీనిపై సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంతో చర్చించారు జగన్. రిటైర్డ్ సీఎస్ అజయ్ కల్లాంరెడ్డి, ఐవీఆర్ కృష్ణారావు సేవలను జగన్ మళ్ళీ ఉపయోగించుకోనున్నారని తెలుస్తోంది.. వారికి ఏపీపై పూర్తి అవగాహన ఉంది అనేది తెలిసిందే. అంతేకాకుండా గతంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన పీవీ రమేష్ ఇటీవలే కేంద్ర సర్వీసుల నుంచి రాష్ట్రానికి వచ్చారు. కాగా మరికొన్ని రోజుల్లో రిటైర్ కానున్న ఈ అధికారికి జగన్ కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని జగన్ సన్నిహితులు చెబుతున్నారు, కొన్ని సంస్కరణలు ప్రక్షాళనలు మార్పులు చేయాలి అని జగన్ భావిస్తున్నారు.

చంద్రబాబుకు కీలకంగా ఈ అధికారులు ఇప్పటి వరకూ పనిచేశారు… ఆర్టీజీఎస్ సీఈవో అహ్మద్ బాబు, సీఎంవోలో పనిచేస్తున్న జీఏడీ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీకాంత్, ప్రిన్సిపల్ సెక్రెటరీ రాజమౌళి, సాయి ప్రసాద్, స్పెషల్ సెక్రెటరీ టూ సీఎం సతీష్ చంద్ర, స్పెషల్ సెక్రెటరీ టూ సీఎం గిరిజా శంకర్, సీఆర్డిఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్, ఫైనాన్స్ స్పెషల్ సెక్రెటరీ ముద్దాడ రవిచంద్ర, ఏపీఎడీసీ ఎండీ వెంకయ్య చౌదరి, ఎనర్జీ అండ్ సీఆర్డీఏ ప్రిన్సిపల్ సెక్రెటరీ అజయ్ జైన్, సెర్ఫ్ సీఈవో కృష్ణమోహన్, ఏపీపీఎఫ్ఎస్ఎస్ సీఈవో క్రిష్ణదేవరాయలు, ఐ అండ్ పీఆర్ కమిషనర్ వెంకటేశ్వర్లు వున్నారు. వీరిలో క్రిష్ణమోహన్ రిటైర్డ్ అధికారి. వాసిరెడ్డి క్రిష్ణదేవరాయలు బయటి వ్యక్తి కాబట్టి ఈయనకు పూర్తిగా ఉద్వాసన పలుకనున్నారు. కాగా మిగిలిన వారందరికీ కూడా బదిలీలు తప్పనిసరి ఉంటుంది అని తెలుస్తోంది, ఇక చాలా శాఖల్లో దాదాపు 25 మందికి బదిలీలు చేయనున్నారట.
సీనియర్స్ సిన్సియర్ అధికారులు ఎక్కడ ఉన్నా డిప్యుటేషన్ పై ఇక్కడకు తీసుకురావాలి అని చూస్తున్నారు ఆయన.

Latest Updates

More...

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.