
నగరానికి దిగ్గజ ఐటీ కంపెనీ..వరంగల్‌వాసులకు గుడ్ న్యూస్
రాష్ట్ర రెండో రాజధాని వరంగల్ నగరంలో టెక్ సెంటర్ ఏర్పాటుకు అమెరికా దిగ్గజ ఐటీ కంపెనీ జెన్‌పాక్ట్ ముందుకొచ్చింది. మంత్రి కేటీఆర్‌తో చర్చల తర్వాత ఈ మేరకు నిర్ణయం
వరంగల్‌వాసులకు గుడ్ న్యూస్.. నగరంలో టెక్ సెంటర్ ఏర్పాటుకు అమెరికాకు చెందిన దిగ్గజ ఐటీ కంపెనీ జెన్‌పాక్ట్ ముందుకొచ్చింది. ఈ మేరకు ఆ కంపెనీ సీఈవో త్యాగరాజన్ మంత్రి కేటీఆర్‌తో వర్చువల్‌గా జరిగిన సమావేశంలో తెలిపారు. ఇప్పటికే సైయంట్, టెక్ మహీంద్ర కంపెనీలు వరంగల్‌లో నుంచి ఆపరేట్ చేస్తుండగా.. వీటి సరసన జెన్‌పాక్ట్ కూడా చేరనుంది.
వచ్చే ఆరు నెలల్లో వరంగల్‌లో ఈ టెక్ సెంటర్ సేవలను ఆరంభించనుంది. దీంతో వరంగల్‌లో కొత్తగా ఐటీ ఉద్యోగాలు కల్పిస్తామని కంపెనీ సీఈవో త్యాగరాజన్ మంత్రి కేటీఆర్‌కు వివరించారు. ఈ ప్రకటనపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. జెన్‌పాక్ట్ రాకతో వరంగల్‌లో ఐటీ మరింత బలోపేతం అవుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఐటీ అభివృద్ధికి సహకరిస్తున్న సంస్థలకు తమ మద్దతు ఉంటుందని కేటీఆర్ తెలిపారు. జెన్‌పాక్ట్ సీఈవో త్యాగరాజన్, వారి బృందానికి కేటీఆర్ అభినందలు తెలిపారు. జెన్‌పాక్ట్ టెక్ సెంటర్‌తో వరంగల్ నగరం అత్యున్నత స్థాయికి ఎదగనుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. దీనిపై మంత్రి ట్వీట్ కూడా చేశారు.
Recent News
Latest Updates
- నారా రోహిత్, శ్రీ విష్ణు (హీరో మిత్రుల) చేతుల మీదుగా థౌసండ్ మూన్స్ ఇన్ఫ్రా ఘన ప్రారంభం
- పటారు పాలెం ప్రేమ కథ మూవీ రివ్యూ
- ప్రియురాలు కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి “విక్రమ్” సినిమా
- ఏపీ ప్రభుత్వంపై వర్మ సెటైర్లు..ఉప్మా, ఇడ్లీ, చీరల రేట్లు కూడా ఫిక్స్ చేస్తారా? YS Jagan
- చిచ్చురేపిన సోషల్ మీడియా పోస్ట్, తీవ్ర ఉద్రిక్తత…బాలయ్య ఇంటిని ముట్టడించిన వైసీపీ
- తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వు…జగన్ బెయిల్ రద్దుపై
- చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తున్నారా..?చంద్రబాబు లెక్క తప్పిందా..?
- లేఖ రాసిన సీఎం జగన్… ఏపీలో పింఛన్ తీసుకునేవారికి గుడ్‌న్యూస్