టీడీపీకి అదే గతి కొడాలి నాని

తెలుగుదేశం పార్టీ నేతలపై చంద్రబాబుపై లెఫ్ట్ అండ్ రైట్ కామెంట్లు విమర్శలు చేయడంలో ముందు ఉంటారు మంత్రి కొడాలి నాని.. తెలుగుదేశం పార్టీ ఇక ఉండదు అని, ఆ పార్టీ లో నేతలకు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అయిపోయింది అనే ఆలోచన వచ్చింది అని అన్నారు నాని. అంతేకాదు తాజాగా బాబు రాజకీయాలపై కామెంట్లు చేశారు ఆయన.. తెలంగాణాలో టీడీపీని భూస్థాపితం చేసిన చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ లో కూడా అలానే చేసి తీరుతారని కొడాలి నాని అన్నారు.

తెలంగాణాలో టీడీపీ భూస్థాపితానికి కారణం చంద్రబాబు, నారా లోకేష్ అని మంత్రి కొడాలి నాని విమర్శించారు. ఓటుకి నోటు కేసులో కూడా దొరకడం తో పూర్తిగా టీడీపీ కి కోలుకోలేని దెబ్బ అని చెప్పాలి. అయితే ఆనాడు సీనియర్ ఎన్టీఆర్ టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు, కాని ఇప్పుడు భూస్థాపిత అధ్యక్షులు చంద్రబాబు అని విమర్శించారు ఆయన.

చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నియోజక వర్గం చంద్రగిరి గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు మంత్రినాని . ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కి అధ్యక్షుడిగా ఉండగా టీడీపీ మూడు సార్లు, కాంగ్రెస్ ఒకసారి చంద్రగిరిలో గెలిచిందని అన్నారు. అయితే రాజకీయంగా చంద్రబాబు టీడీపీ పగ్గాలు చేపట్టిన తర్వాత వరుసగా మూడు సార్లు కాంగ్రెస్ రెండు సార్లు వైసీపీ గెలిచిందని అన్నారు, మరి చంద్రబాబు సొంత నియోజకవర్గం పుట్టింది పెరిగింది ఇక్కడే మరి ఎందుకు ఇక్కడ గెలవలేకపోతోంది అని ప్రశ్నించారు. ఈ బాబు ఆయన తనయుడు జగన్ పై విమర్శలు చేస్తే ఎవరూ పట్టించుకోరు అని కౌంటర్ ఇచ్చారు నాని.

Latest Updates

More...

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.