
పులివెందుల నుంచి బరిలోకి లోకేష్ ? బాబుకి సలహాలు
తెలుగుదేశం పార్టీకి పులివెందులలో ఇక అడ్రస్ గల్లంతు అయింది ..ఇక్కడ పార్టీని ముందుకు నడపించే వారు లేరు ..ఉన్నా ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న నాయకులకి చంద్రబాబు బాధ్యతలు ఇవ్వాలి.. మొత్తానికి పులివెందులలో సతీష్ రెడ్డి చంద్రబాబుకి ఓ ఝలక్ ఇచ్చారు అనే చెప్పాలి, అయితే ఇది చంద్రబాబుకి మంచి అవకాశం అని చాలా మంది సలహా ఇస్తున్నారట, ఎందుకు అంటే ఇప్పుడు జగన్ సీఎంగా ఉన్నారు పైగా పులివెందులలో ఎమ్మెల్యేగా ఉన్నారు.
ఇక్కడ తెలుగుదేశం పార్టీకి నాయకుడు లేరు కాబట్టి మన లోకేష్ ని ఇక్కడ నుంచి తెలుగదేశం పార్టీ తరపున బరిలోకి దించితే బెటర్ అంటున్నారు, ఎందుకు అంటే ఓ సీఎం పై పోటీ చేసినట్లు ఉంటుంది ? గెలిస్తే దేశంలోనే రికార్డు అవుతుంది ? చంద్రబాబుని మించిన పేరుని లోకేష్ ఎన్నికల్లో తెచ్చుకోవచ్చు అని బాబుకి సలహా ఇస్తున్నారట కొందరు.
అయితే పులివెందుల రౌడీలు అని సంబోధించిన బాబు, పులివెందుల జనాలు ఉత్తములు నా కొడుక్కి ఓటు వేయండి అని అడిగే దైర్యం ఉంటుందా? ఇది పెద్ద డౌట్? ఎందుకు అంటే మంగళగిరి నుంచి శ్రీకాళహస్తి వరకూ ఎక్కడ చూసుకున్నా చరిష్మా లోకేష్ కి లేదు అంటున్నారు, ఈ సమయంలో జగన్ కోటలోనే పాగా వేయాలి అని చెబుతున్నారట, కాని నిజంగా చంద్రబాబు ఇంత సాహసం చేస్తారా?
గతంలో వద్దెంటే వెళ్లాను మంగళగిరికి అనేది మళ్లీ వద్దంటే వెళ్లాను పులివెందులకి అనే పాట ట్యూన్ వచ్చేస్తుంది అంటున్నారు కొందరు సీనియర్లు, మొత్తానికి ఇలా నేతలు ఖాళీ అవ్వడంతో చాలా చోట్ల లోకేష్ కి మాత్రం మంచి అవకాశం దొరుకుతోంది.. ఏదో చోట తనకు నచ్చిన చోట నుంచి పోటీ చేసేందుకు ఇప్పటి నుంచి కర్చీఫ్ వేసుకోవచ్చు అంటున్నారు, మొత్తానికి లోకేష్ ను పులివెందుల నుంచి చంద్రబాబు దింపే సాహసం చేస్తారా అనేది కాలమే నిర్ణయించాలి.
Recent News
Latest Updates
- నారా రోహిత్, శ్రీ విష్ణు (హీరో మిత్రుల) చేతుల మీదుగా థౌసండ్ మూన్స్ ఇన్ఫ్రా ఘన ప్రారంభం
- పటారు పాలెం ప్రేమ కథ మూవీ రివ్యూ
- ప్రియురాలు కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి “విక్రమ్” సినిమా
- ఏపీ ప్రభుత్వంపై వర్మ సెటైర్లు..ఉప్మా, ఇడ్లీ, చీరల రేట్లు కూడా ఫిక్స్ చేస్తారా? YS Jagan
- చిచ్చురేపిన సోషల్ మీడియా పోస్ట్, తీవ్ర ఉద్రిక్తత…బాలయ్య ఇంటిని ముట్టడించిన వైసీపీ
- తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వు…జగన్ బెయిల్ రద్దుపై
- చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తున్నారా..?చంద్రబాబు లెక్క తప్పిందా..?
- లేఖ రాసిన సీఎం జగన్… ఏపీలో పింఛన్ తీసుకునేవారికి గుడ్న్యూస్