
కేంద్రానికి ఎంపీ రఘురామ సంచలన లేఖ.. ఏపీ రాజధానిగా విశాఖ ప్రస్తావన
కేంద్రం సమాధానం చెబుతూ ఏపీ రాజధాని విశాఖగా ప్రస్తావించింది. ఈ వ్యవహారంపై పెద్ద దుమారమే రేగింది. తాజాగా ఏపీ రాజధాని వ్యవహారంపై నర్సాపురం ఎంపీ
ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం ఏది..? జగన్ సర్కారు ప్రతిపాదించిన మూడు రాజధానులతో ఈ వ్యవహారం అందరిలోనూ ఓ కన్ఫ్యూజన్ నడుస్తోంది. రాజధాని వివాదం కోర్టుకు చేరడం.. ఆ వెంటనే కరోనా కారణంగా మూడు రాజధానుల వ్యవహారం కొన్నాళ్లు మరుగున పడింది. తాజాగా ఏపీ రాజధాని వ్యవహారంపై మళ్లీ చర్చ మొదలైంది. లోక్‌సభలో జులై 26న పెట్రో పన్నులు ఎక్కడెక్కడ ఎంత వసూలు చేస్తున్నారనే అంశంపై కేంద్రం సమాధానం చెబుతూ ఏపీ రాజధాని విశాఖగా ప్రస్తావించింది. ఈ వ్యవహారంపై పెద్ద దుమారమే రేగింది.
రాజధాని వ్యవహారంపై దుమారం రేగడంతో కేంద్రం దిద్దుబాటు చరల్యు తీసుకుంది. విశాఖ అన్న దగ్గర కేపిటల్ సిటీ లేదా రిఫరెన్స్ సిటీగా చదువుకోవాలని ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఒక నోట్ విడుదల చేసింది. దీంతో గత నెల 26న తేదీన సభలో అడిగిన 84వ నంబరు ప్రశ్నకు కేంద్రం ఇచ్చిన లిఖితపూర్వక సమాధానానికి సవరణ చేసినట్లైంది.
ఈ క్రమంలో తాజాగా ఏపీ రాజధాని వ్యవహారంపై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు కేంద్రానికి లేఖ రాశారు. కేంద్రం పెట్రోల్ ధరలపై అడిగిన ప్రశ్నకు సమాధాన పత్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విశాఖపట్నం అని పేర్కొనడం సరికాదన్నారు. వెంటనే ఏపీ రాజధాని అమరావతి అని మార్చేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు శాఖా మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరికి లేఖ రాశారు.
Recent News
Latest Updates
- నారా రోహిత్, శ్రీ విష్ణు (హీరో మిత్రుల) చేతుల మీదుగా థౌసండ్ మూన్స్ ఇన్ఫ్రా ఘన ప్రారంభం
- పటారు పాలెం ప్రేమ కథ మూవీ రివ్యూ
- ప్రియురాలు కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి “విక్రమ్” సినిమా
- ఏపీ ప్రభుత్వంపై వర్మ సెటైర్లు..ఉప్మా, ఇడ్లీ, చీరల రేట్లు కూడా ఫిక్స్ చేస్తారా? YS Jagan
- చిచ్చురేపిన సోషల్ మీడియా పోస్ట్, తీవ్ర ఉద్రిక్తత…బాలయ్య ఇంటిని ముట్టడించిన వైసీపీ
- తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వు…జగన్ బెయిల్ రద్దుపై
- చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తున్నారా..?చంద్రబాబు లెక్క తప్పిందా..?
- లేఖ రాసిన సీఎం జగన్… ఏపీలో పింఛన్ తీసుకునేవారికి గుడ్న్యూస్