janampulse

రాజ్యసభలో నెల్లురు నాయకులదే హవా

Nellore district YSRCP

ఏపీలో రాజ్యసభ సభ్యులు నలుగురు ఎవరు వస్తారు అనేది పెద్ద ఆలోచన, సీఎం జగన్ నోటి నుంచి ఇంకా ఏ మాట రాలేదు .. విజయసాయిరెడ్డి ఎంపీగా ఎక్కడా లీకులు ఇవ్వడం లేదు… అంతా జగన్ చెప్పిందే అని ఆయన ఇంటర్నల్ గా పార్టీ నేతలతో అంటున్నారు.. అయితే బాబులాగా ఆయన కూడా వ్యాపారవేత్తలకు ఇస్తారా పార్టీ జెండా మోసిన వారికి అవకాశం ఇస్తారా అనేది చూడాలి.

అయితే ముఖ్యంగా ఇప్పుడు అయెధ్యరామిరెడ్డి అలాగే వైవీ సుబ్బారెడ్డిపేర్లు వినిపిస్తున్నాయి .. వీరిద్దరికి బెర్తులు కన్ఫామ్ అయ్యాయట, అయితే ఇక్కడ మరో వార్త వినిపిస్తోంది..ఇప్పటికే వైసీపీకి చెందిన ఇద్దరు రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్నారు, విచిత్రం ఏమిటి అంటే అందులో విజయసాయిరెడ్డి ఒకరు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరొకరు వీరిద్దరూ కూడా నెల్లూరు నాయకులే.

అయితే ఇక ఇప్పుడు బీద మస్తాన్ రావు పేరు తెరపైకి వచ్చింది.. ఒకవేళ జగన్ ఆయనకు అవకాశం ఇస్తే కచ్చితంగా నెల్లూరు నుంచి ముగ్గురు నేతలకు రాజ్యసభ సీటు ఇచ్చినట్టే.. అంటే ఆరుగురు సభ్యుల బలంలో ముగ్గురు నెల్లూరు జిల్లా వారే ఉంటారు.. సో చూడాలి జగన్ నిర్ణయం ఎలా ఉంటుందో.మరి ఎవరికి సీట్లు ఇస్తారో.

Recent News

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.