janampulse

దగ్ధమైన రథం సిద్ధం.., అచ్చం అలాగే…

జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రథం దగ్ధం అంశం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. సెప్టెంబర్ 5 అర్ధరాత్రి రథం అనుమానాస్పద స్థితిలో దగ్ధమైంది. ఘటనపై హిందూ ధార్మిక సంఘాలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాయి. వైసీపీ హయాంలో హిందూ ఆలయాలు దాడులు పెరిగిపోయాయంటూ ప్రతిపక్ష పార్టీలు ఆందోలనలకు చేపట్టాయి. రథం దగ్ధంపై అనేక ప్రచారాలు కూడా జరిగాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అని కొందరు, తేనె తుట్టె తీసే క్రమంలో మంటలు చెలరేగాయని కొందరు భావించారు. దీనిపై పెద్ద దుమారం రేగడంతో రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది.

అదే సమయంలో ప్రభుత్వం కొత్త రథం నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో కేవలం రెండు నెలల్లోనే నూతన రథం నిర్మాణం పూర్తైంది. 41  అడుగుల ఎత్తులో అచ్చుగుద్దినట్లు పాత రథాన్ని తలపించేలా ఆకర్షణీయంగా, శాస్త్రోక్తంగా రథాన్ని తీర్చిదిద్దారు. ఆరు చక్రాలు, ఏడు అంతస్తులతో రథాన్ని అంత్యంత సుందరంగా తయారు చేశారు. పాతరథంపై ఉన్నట్లుగానే దేవతా మూర్తులు, సింహాల, గుర్రాల ప్రతిమలు చక్కగా రూపొందించారు. రథం శిఖరాన్ని బంగారు వర్ణంలో తీర్చిదిద్దారు.

రథం కలపకు, తయారీకి, మండపం, ఇనుప షట్టర్ కు కలిపి మొత్తం రూ.95లక్షలను ప్రభుత్వం వెచ్చించింది. అనుకున్న లక్ష్యానికంటే ముందుగానే అధికారులు రథాన్ని సిద్ధం చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే స్వామివారి కల్యాణోత్సవం నాటికి రథాన్ని సిద్ధం చేస్తామని ప్రభుత్వం ప్రకటించగా.. మూడు నెలలు ముందుగానే రథం  అత్యంత సుందరంగా ముస్తాబు అయింది.

మరోవైపు లక్ష్మీనరసింహస్వామికి నూతన రథం సిద్ధమైనా 80ఏళ్ల చరిత్ర కలిగిన పాతరథం దగ్ధమవడానికి గల కారణాలను మాత్రం ప్రభుత్వం ఇంతవరకు గుర్తించలేకపోయింది. కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించినా విచారణ మాత్రం ప్రారంభం కాలేదు. 

Recent News

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.