కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు జగన్ మరో కీలక స్టెప్

NTR's name for Krishna district is another key step YS Jagan

వైసీపీ అధికారంలోకి వస్తే ప్రతీ పార్లమెంట్ సెగ్మెంట్ ను జిల్లాగా మారుస్తా అని చెప్పారు జగన్, ఇప్పుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారు.. తాజాగా ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.. తన కేబినెట్ పై ఇంకా ప్రజలు చర్చించుకుంటున్నారు.. బీసీలకు పెద్ద పీట వేశారు జగన్, అలాగే బడుగు బలహీన వర్గాల వారికి ఇప్పటి వరకూ ఎవరూ ఇవ్వనన్ని పదవులు ఇచ్చారు జగన్ . ఇప్పుడు మరో విషయం ఏపీలో జిల్లాల విభజన అంశం ఊపందుకుంది. ఇక 25 జిల్లాల ఏర్పాటు జగన్ చేస్తారు అని వార్తలు వినిపించాయి.. కాదు 30 జిల్లాలు చేసే ప్రక్రియ జగన్ చేస్తున్నారు అని అంటున్నారు.. మొత్తానికి జగన్ జిల్లాల ఏర్పాటుపై కూడా అధికారులతో చర్చలు జరిపారు .. ఏదో ఓ రోజు ఈ విషయం కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉంది.

ఇక జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన ఒక హామీని ప్రస్తావించుకుని తీరాలి , ఎన్నికల సమయంలో అదే ఇప్పటి వరకూ తెలుగుదేశం పార్టీ కూడా ఆ సాహసం చేయలేదు, అసలు ఆ పార్టీ పెట్టిన ఎన్టీఆర్ ని వీరు ఎప్పుడో మర్చిపోయారు. అందుకే ఆయన సొంత జిల్లా పై ఏనాడు బాబు ప్రేమ చూపించలేదు. ఎన్నికల కోసం కేవలం ఎన్టీఆర్ పేరు తెరపైకి తెస్తారు అని అంటారు ప్రజలు, ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ మాత్రం తాను ఎన్నికల సమయంలో చెప్పిన విషయాలు పాదయాత్రలో ఇచ్చిన హామీలు అన్నీ నెవరేర్చే విధంగా ముందుకు వెళుతున్నారు అని చెప్పాలి.

అయితే కృష్ణా జిల్లా పేరును ఎన్టీఆర్ పేరు మీద మారుస్తాం అని చెప్పారు జగన్, ఇప్పుడు తాజాగా దీనిపై మరో వార్త వినిపిస్తోంది…జిల్లాల విభజన తర్వాతే ఎన్టీఆర్ పేరు మీద ఒక జిల్లా ఏర్పడుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఇచ్చింది. అయితే కృష్ణాజిల్లా పేరు అలాగే ఉంటుంది మరో పక్క కొత్త జిల్లా పేరును ఎన్టీఆర్ జిల్లాగా నామకరంణం చేస్తారట. మొత్తానికి అసెంబ్లీ సమావేశాల తర్వాత ఈ నిర్ణయం తీసుకుంటారట.

Latest Updates

More...

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.