ఈ నెల 15న చంద్రబాబు కీలక నిర్ణయం

CBN

వైసీపీ అధికారంలోకి రావడం, జగన్ ముఖ్యమంత్రి అవ్వడం చంద్రబాబు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు… ఇది సాధ్యమైందా అని బాబు ఆవేదన, ఎల్లో మీడియాలలో స్పష్టంగా కనిపిస్తోంది.. వారు అధికారంలో ఉన్న సమయంలో జగన్ అనేక విషయాలపై పోరాటాలు చేశారు. అప్పుడు చంద్రబాబు మాత్రం నవ్వుకునేవారు, జగన్ పై దాడి జరిగిన సమయంలో కూడా కోడికత్తి అంటూ వెటకారాలు చేశారు, ఇలా బాబు రాజకీయం అంతా తెలిసిందే, ఇక చంద్రబాబు ఓటమితో జగన్ సర్కారు ఇప్పుడు ఏపీలో కొలువుదీరింది .అంతేకాదు జగన్ ఇప్పుడు బాబుపై పెద్ద ఎత్తున దాడులకు సిద్దం అవుతున్నారు అని వార్తలు రావడంతో చంద్రబాబుకు టెన్షన్ కూడా పెరిగిపోయింది. అయితే జగన్ దాడులు చేయడం అనేది కాదు ఇలా వక్రభాష్యాలు రాస్తోంది ఎల్లో మీడియా, ఆనాడు టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో చేసిన అవినీతి అక్రమాలు బయటకు తీసుకువచ్చేందుకు సిద్దం అయింది, కాని ఎల్లో మీడియా మాత్రం దీనిని తెలుగుదేశం పై దాడులుగా చిత్రీకరిస్తోంది.

అయితే చంద్రబాబు తాజాగా టీడీపీ కార్యకర్తలపై జరిగిన దాడులను ఖండించారు. పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహించిన చంద్రబాబు ప్రస్తుతానికి రాష్ట్రంలో టీడీపీ శ్రేణులు పరిస్థితిని నాయకులకు వివరంగా వివరించారు చంద్రబాబు… అంతేకాకుండాఈ నెల 15న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులతో సమావేశం నిర్వహిస్తున్నట్టు చంద్రబాబు చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు కార్యకర్తలకు, నేతలకు పార్టీ ఎల్లప్పుడూ కూడా అందుబాటులో ఉంటుందని, ఎలాంటి సమస్యలు రానీకుండా చూసుకుంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు… రాష్ట్రంలో వైసీపీ నేతలు తమపై దాడులు చేస్తున్నారని వాటిని తిప్పికొట్టాలి అని తెలుగుదేశం భావిస్తోందట. అన్ని నియోజకవర్గాల్లో నిరసన దీక్షలకు టీడీపీ సిద్దం అవుతోందట, సో రాజకీయంగా ఇప్పుడు ఏపీలో ఇది హీట్ పుట్టిస్తున్న అంశం అని చెప్పాలి.

Latest Updates

More...

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.