janampulse

పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల పార్టీ మారతారా ?

Palakollu MLA Nimmala Ramanaidu Ready to Join in YSRCP

ఏపీలో గత తెలుగుదేశం ప్రభుత్వంలో ముందు పశ్చిమగోదావరి జిల్లా గురించి చెప్పుకోవాలి.. 2014 ఎన్నికల్లో జిల్లాలో క్లీన్ స్వీప్ చేసింది ..అయితే 2019 ఎన్నికల్లో మాత్రం బోల్తా పడింది, జిల్లాలో పాలకొల్లు, ఉండి నియోజకవర్గాలను మాత్రమే గెలుచుకోగలిగింది. ఇక బాబు కూడా పార్టీ ఓడిపోవడంతో ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నారు, అయితే ఈ సమయంలో జిల్లా నుంచి టీడీపీ తరపున అన్నీ తానై బాబుకి వెన్నంటి ఉంటున్నారు పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. నిజంగా బాబు అధికారంలో ఉన్నప్పుడు నలుగురిలో ఉండే ఆయన ఇప్పుడు నేరుగా బాబుకి బాగా దగ్గర అయ్యారు.

2014 ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి ఇంత వైసీపీ వేవ్స్ ఉన్నా 2019 ఎన్నికల్లో పాలకొల్లు నుంచి గెలిచారు, అయితే ఇక్కడ వైసీపీదే స్వయంకృతాపరాధం అని చెప్పుకోవాలి. కాని ప్రతీదానికి మీడియా దృష్టిని ఆకర్షించే నిమ్మలకు ఈ మధ్య మీడియా ఫోకస్ వస్తోంది .అంతా బాబుగారి పక్కన ఉండటం వల్ల, అంతేకాని పాలకొల్లు ప్రజల పెద్దగా నిమ్మలని పట్టించుకోవడం లేదట, వైసీపీ అధికారంలో ఉండటంతో అక్కడ వైసీపీ ఇంచార్జ్ తోనే పనులు అన్నీ చేయించుకుంటున్నారు.
ఇక ఎమ్మెల్యే పదవి కేవలం అలంకార ప్రాయంగా మాత్రమే ఉంది అని నిమ్మల భావిస్తున్నారు, అయితే సౌమ్యుడిగా వివాదాలకు దూరంగా ఉండే నాయకుడు, జిల్లాలో పేరు సంపాదిన యువనేత కవురు శ్రీనివాస్ కి ఇక్కడ బాధ్యతలు అప్పగించారు సీఎం జగన్, ఇక వైసీపీ తరపున ఆయన పాలకొల్లు ఇంచార్జ్ గా ఉన్నారు, ఇక ఇటీవల ఆయనకు డీసీసీబీ చైర్మన్ పదవిని ఇచ్చారు, ఇక వైసీపీలో మరోకీలక నాయకుడిగా యడ్ల తాతాజీ పాలకొల్లు నుంచి ఉన్నారు, ఆయనకు కూడా సీఎం జగన్ డీసీఎంఎస్ చైర్మన్ పదవి ఇచ్చారు. సో ఇద్దరు వైసీపీని ప్రజల్లో తీసుకువెళుతున్నారు.

అయితే ఈ మధ్య టీడీపీలో చాలా మంది వైసీపీలో చేరుతున్నారు.. ఈ సమయంలో నిమ్మల కూడా వైసీపీలో చేరుతారు అని వార్తలు వినిపిస్తున్నాయి, పాలకొల్లు రాజకీయం చూస్తే చాలా మంది వైసీపీలో సీనియర్లు ఉన్నారు, ఈ సమయంలో నిమ్మలను పార్టీలోకి తీసుకువస్తే వైసీపీకి ఇక తిరుగు ఉండదు అని భావిస్తున్నారు, అయితే ఎన్నికల సమయంలో డాక్టర్ బాబ్జీని వైసీపీలోకి తీసుకువచ్చి నియోజకవర్గ కన్వీనర్ పదవి కట్టబెట్టారు. కానీ ఎన్నికల్లో ఆయన ఓటమి చెందడంతో కన్వీనర్ పదవిని తొలగించి కవురు శ్రీనుకు అప్పగించారు.

అయితే కొద్దికాలం వైసీపీలో ఉండి సీటు రాక జనసేనలో చేరిన గుణ్ణం నాగబాబు కూడా మళ్లీ తిరిగి వైసీపీలో చేరుతారు అని వార్తలు వచ్చాయి, కాని ఆయన వైసీపీలోకి వచ్చే అవకాశాలు లేవు అంటున్నారు, అయితే నిమ్మల వర్గం కూడా టీడీపీలోనే ఉంటాం కాని వైసీపీలో చేరేది లేదు అంటున్నారు.. ఇవన్నీ కేవలం పుకార్లు అంటున్నారు. మరి చూడాలి ఈ వార్తలు నిజమా లేదా అనేది.

Recent News

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.