రేసులో పవన్ ఫస్ట్ చంద్రబాబు సెకండ్ -వైసీపీ రిపోర్టు

babu-pawan

సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చి చాలా తక్కువ మంది సక్సెస్ అయ్యారు అని చెప్పాలి.. తమిళనాడులో ఇప్పుడు ఆ లిస్టు చాలా పెద్దది ఉంది.. ఇక ఏపీలో తెలంగాణలో చూస్తే ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్ సక్సెస్ అయ్యారు.. చిరంజీవి ఫెయిల్ అయ్యారు.. పవన్ కల్యాణ్ ఏమయ్యారో తాజాగా ఫలితాలు తేల్చేశాయి. అయితే చంద్రబాబు పవన్ ఇప్పుడు ఒకరిని ఒకరు విమర్శించుకునే టైం కాదు అని భావిస్తున్నారు, వీరు ఇద్దరూ గతంలో ప్రతిపక్షంలో ఉన్న జగన్ పై విమర్శలు చేశారు , ఇక ఇప్పుడు మళ్లీ జగన్ అధికారంలోకి రావడంతో జగన్ పై విమర్శలు చేస్తారు అనేది తేలిపోయింది. టైం వేరు మేటర్ మాత్రం అదే, ఇప్పుడు ఓటమిని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నాడు అని చెప్పాలి.

ఇక పవన్ కూడా కారాలు మిరియాలు గసగసాలు అన్నీ నమిలేస్తున్నాడట ఇంత దారుణమా రెండు చోట్లా ఎలా ఓటమి వచ్చింది అని, గెలిచిన ఒక సీటుని పక్కన పెట్టి, 174 సీట్లలో ఓటమి ఎందుకు వచ్చింది అని తెగ విచారణలు, ఇంటరాగేషన్లు చేస్తున్నాడు పవన్. అయితే బాబు మాత్రం బిజీ బిజీగా ఉన్నారు. నిజంగా ఐదేళ్లు ఏపీ పాలనలో బిజీగా ఉన్న బాబు, కుటుంబంతో బిజీగా ఉన్నారు. అయితే పవన్ మాత్రం బాబు కంటే ముందు ఉన్నాడు జగన్ పై టార్గెట్ లో అని చెప్పాలి.

సీఎం జగన్ పై ఎక్కడ అవకాశం దొరికినా రాజకీయంగా విమర్శలకు సిద్దంగా ఉన్నారు పవన్, కాని జగన్ మాత్రం అలాంటి అవకాశం ఇవ్వడం లేదు అని చెప్పాలి .. చంద్రబాబు ఇంకా రంగంలోకి దిగలేదు, ఇప్పుడు గ్రౌండ్ వర్క్ సిద్దం చేసుకుంటున్నారు బాబు, ఎందుకు అంటే 175 లో కేవలం 23 చోట్ల మాత్రమే నేతలు ఉన్నారు, ఇక బాబుకు ఇదే పెద్ద బాధ , ముందు తన పార్టీని నిలదొక్కుకుని, తర్వాత వేరే పార్టీపై విమర్శలు చేయాలి అని బాబు ఆలోచన. అయితే పవన్ మాత్రం నేరుగా రంగంలోకి దిగారు, చూద్దాం పవన్ మాట బట్టీ మనం రియాక్ట్ అవుదాం అని వైసీపీ కూడా చూస్తోంది. మరి పవన్ ఎలాంటి విషయాలు పట్టుకుంటారో చూడాలి, ఎందుకు అంటే జగన్ చంద్రబాబులా కాదు చేస్తాను అన్న ప్రతీదీ కూడా చేసుకువెళ్లేందుకు ముందుకు వెళుతున్నారు. జగన్ అవకాశం ఇస్తారా అంటే నో ఛాన్స్ అంటున్నారు వైసీపీ నేతలు. ఈ విషయంలో రేసులో పవన్ ముందు ఉన్నారు, బాబు వెనకపడ్డారు అనే చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు.

విశ్లేషణ-వీజీ

Latest Updates

More...

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.