బాబుకంటే ఈ విషయంలో పవన్ బెటర్

Pawan is better than Chandra Babu

ఏపీ మాజీ ముఖ్యమంత్రి అనే పదం చంద్రబాబు వినలేకపోతున్నారు.. అందుకే మీడియా స్పేస్ కోసం ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు బాబు.. అయితే చంద్రబాబు ఇటీవల సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాల గురించి గంట సేపు భారీ ఉపన్యాసం ఇచ్చారు…అయినా మార్పు లేదు టీడీపీలో, దీనిపై ఎక్కడ వేసిన పోస్టు ఎక్కడ రాసిన రాత అక్కడే ఉన్నట్లు ఉంది. అక్కడ వైసీపీ నేతలు తగ్గడం లేదు ఇక్కడ టీడీపీ నేతలు తగ్గడం లేదు, ఇటు సీఎం జగన్ పై అలాంటి నీచమైన పోస్టులు పెడుతున్నారు టీడీపీ సోషల్ సైన్యం.. ఇటు అధికారంలో ఉన్న వైసీపీ అభిమానులు కూడా ఇదే చేస్తున్నారు.

ఎవరికి వారు తగ్గడం లేదు. అయితే చంద్రబాబు ఇక్కడ ఒకటి గుర్తు ఉంచుకోవాలి.. తాను అధికారంలో ఉన్న సమయంలో జరిగింది ఒప్పు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో జరుగుతోంది తప్పు అంటున్నారు. దీనిపై పెద్ద ఎత్తున బాబుకు బూమరాంగ్ అవుతోంది, ఆయన అధికారంలో ఉన్న సమయంలో వైసీపీ నేతలు ఎన్ని కేసులు పెట్టినా అవన్నీ చెత్తకుప్పలో వేయించారు, ఇప్పుడు వైసీపీ కూడా అదే చేస్తోంది. ఇక బాబు కంటే సోషల్ మీడియాలో విషయంలో జనసేనాని పవన్ బెటర్ అంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే జనసేన పార్టీ తమ తమ పార్టీ సభ్యులు సోషల్ మీడియాలో ఎలా ప్రవర్తించాలో? ఎలా పద్దతిగా నడుచుకోవాలో? కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. కాని కొందరు హద్దు మీరుతున్నారు. ఆ అభిమానులను సొంత పార్టీ నేతలు కంట్రోల్ చేస్తున్నారు.

ఇటీవల విజయమ్మ, షర్మిల పై ఓ జనసేన కార్యకర్త దారుణమైన పోస్టు పెట్టాడు , వెంటనే గుర్తించి వైసీపీ అతనిపై కంప్లైంట్ ఇచ్చింది. పోలీసులు అదుపులోకి తీసుకుని జైలులో పెట్టారు.. అయితే దీనిని పవన్ కల్యాణ్ వెనకేసుకు రాలేదు, మా వాడికి అన్యాయం జరిగింది అని చంద్రబాబులా సోషల్ మీడియా కాన్ఫరెన్స్ పెట్టలేదు. అయితే బాబు ఇకనైనా తెలుసుకోవాలి టీడీపీ ఈ కల్చర్ ముందు స్టార్ట్ చేసింది అందుకే టీడీపీ ఇలాంటివి ఆపితే బెటర్ అని అంటున్నారు వైసీపీ నాయకులు. ప్రతిపక్షంలో ఉన్న బాబుపై పోస్టులు కనిపిస్తే అంత ఫీలు అయితే, సీఎంగా ఉన్న వ్యక్తిపై పోస్టులు పెడితే మేము ఎంత ఫీల్ అవ్వాలి అంటున్నారు.. నాలుగు నెలలకే బాబు ఇలా ఎనర్జీ వాడేస్తే ఇంకా 56 నెలలు ఎలా పోరాటం చేస్తారు, అనేది ఇప్పుడు మేధావుల ఆలోచన.

Latest Updates

More...

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.