కేసీఆర్ కు పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ కౌంటర్!

Pawan Kalyan counter to CM KCR Survey

గతంలో కొన్ని సార్లు పరస్పరం కౌంటర్లు వేసుకున్నా ప్రస్తుతం తెలంగాణా సీఎం కేసీఆర్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మధ్య మంచి సంబంధాలే ఉన్నాయన్నది తెలిసిందే. అయితే రీసెంట్ గా కేసీఆర్ రహస్యంగా నిర్వహించిన ఓ సర్వే వీరిద్దరి మధ్య చిచ్చు పెట్టినట్టు తెలుస్తోంది. మ్యాటర్ లోకి వెళ్తే వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో తమ పార్టీ పరిస్థితి గురించి సీఎం కేసీఆర్ ఒక సర్వే నిర్వహించుకున్నారు. పనిలో పనిగా ఆంధ్రాలో కూడా పరిస్థితి ఏంటని ఆ సర్వే ఆరా తీసింది. ఆ సర్వేలో వెల్లడైన విషయాలు ఇప్పుడు షాకింగ్ గా మారాయి.

కేసీఆర్ సర్వేలో వచ్చే ఎన్నికల్లో ఏపీలో జగన్ వైసీపీ పార్టీ మొదటి స్థానంలో నిలుస్తుందని తెలుగుదేశం రెండోస్థానానికి పరిమితం అవుతుందని తేలిందట. అదే విధంగా బీజేపీకి ఓట్ల శాతం పెరగొచ్చని, అయితే జనసేన పార్టీ మాత్రం ఏపీ రాజకీయాల్లో ఎటువంటి ప్రభావం చూపదన్నది కేసీఆర్ సర్వే సారాంశం. ఈ విషయం ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ 20 నుంచి 25 సీట్లు గెల్చుకుంటుందని చాలా మంది అంచనా వేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ సర్వే వారి అంచనాలను తలకిందులు చేసింది.

నిన్న ఆంధ్రప్రదేశ్ లో పర్యటించిన జనసేనాని పవన్ కళ్యాణ్ ను విలేకరులు ఇదే విషయాన్ని అడిగారు. దీంతో పవన్ చాలా ఘాటుగా సమాధానం ఇచ్చాడు. తన పార్టీ ప్రభావం చూపుతుందా లేదా అన్న విషయాన్ని తేల్చే శక్తి ప్రజలకే ఉందని చెప్పాడు. అంటే కేసీఆర్ సర్వేపై పరోక్షంగా తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేసినట్టే కదా? ఈ సర్వే వివాదం మరోసారి పవన్, కేసీఆర్ ల మధ్య దూరాన్ని పెంచుతుందా? లేదా అన్నది తెలియాలంటే మరికొన్ని రాజకీయ పరిణామాలు జరగాల్సిందే.

Latest Updates

More...

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.