janampulse

జగన్ ను టార్గెట్ చేసిన పవన్

Pawan vs Jagan

జనసేన అధినేత పవన్ కల్యాణ్.. సీఎం జగన్ టార్గెట్ గా విమర్శలు చేస్తున్నారు. రెండురోజుల పాటు  చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పర్యటించిన ఆయన.., మరోసారి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మద్యం బ్రాండ్లనే ఉదాహరణగా చూపుతూ అధికారపార్టీని  టార్గెట్ చేశారు.

వైసీపీ ప్రభుత్వానికి మద్యం షాపులపై ఉన్న ప్రేమ రైతులపై లేదని మండిపడ్డారు. తుఫాన్ దెబ్బకు నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్న పవన్… మద్యం షాపుల ద్వారా వచ్చే ఆదాయాన్ని రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, గోల్డెన్ ఆంధ్ర కాదని.. సీఎం మెడల్, వైసీపీ మెడల్ పేర్లతో కొత్తకొత్త బ్రాండ్లను విక్రయించి ఆ సొమ్ముతో రైతులను ఆదుకోవాలన్నారు. 151 మంది ఎమ్మెల్యే సీట్లు గెలిచిన వైసీపీ ప్రభుత్వం గోల్డెన్ ఆంధ్ర పేరుతో మద్యం విక్రయిస్తున్నారన్నారు. బంగారు తెలంగాణ ఓకేగానీ.. ఈ బంగారు ఆంధ్రా బాటిల్స్ అమ్ముతారని ఊహించలేదన్నారు.

ఇక తిరుపతి అభ్యర్థిపై సమన్వయ కమిటీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. పోలవరం, అమరావతి, రైతుల సమస్యలపై ఉమ్మడి పోరాటం  చేస్తమని పవన్ స్పష్టం చేశారు. తిరుపతి విషయంలో కార్యకర్తలు, స్థానిక నేతల అభిప్రాయం మేరకే ముందుకెళ్తామన్నారు.

ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే నెల్లూరు, కడప జిల్లాల్లో వేలాది ఇళ్లు నీటమునిగాయన్నారు. అసెంబ్లీ సమావేశాలను కూడా  విమర్శలకే పరమితం చేశారు తప్ప వేరే ప్రయోజనం లేదన్నారు. నివర్ తుఫాన్ బాధితులను పరామర్శించే క్రమంలో తొలి రోజు కృష్ణా గుంటూరు జిల్లాల్లో పర్యటించిన పవన్ కల్యాణ్.. తర్వాత రెండు రోజులు చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పర్యటించారు. ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకోవాలని పవన్ డిమాండ్ చేశారు. ఎకరాకు రూ.35వేల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. త్వరలో జై కిసాన్ పేరుతో రైతుల కోసం ఉద్యమం చేపడతామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

Recent News

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.