పవన్ కల్యాణ్ బాబు బంధం మరోసారి బయటపడింది

చంద్రబాబు నాయుడు పవన్ కల్యాణ్ రాజకీయ మిత్రులు అనేది పెద్దగా చెప్పనవసరం లేదు. 2014 నుంచి చంద్రబాబు పవన్ పార్టీలు వేరుగా ఉన్నా కలిసి పనిచేస్తున్నారు. ఇదే విషయాన్ని వైసీపీ కూడా చెబుతూ ఉంటుంది. అయితే పవన్ కల్యాణ్ ని ఏమైనా అంటే టీడీపీ నేతలు విమర్శలు చేస్తారు .అలాగే చంద్రబాబుని ఏమైనా అంటే పవన్ విమర్శలు చేస్తారు. దీంతో వీరిద్దరి మధ్యఫెవికాల్ బంధం ఉంది అనేది నిత్యంవైసీపీ చెబుతూనే ఉంటుంది.

తాజాగా చంద్రబాబు చిత్తూరులో కూడా తన మనసులో మాట చెప్పారు, పవన్ కల్యాణ్ మనోభావాలు దెబ్బతినేలా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు అని అంటున్నారు చంద్రబాబు, మరి ఇంత నీతివంతమైన మాటలు మాట్లాడే బాబుగారు పవన్ కు కూడా జగన్ మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడకూడదు అని చెబుతున్నారా, ఇక ప్రసంగాల సమయంలో పవన్ ప్రసంగించే తీరు ఎలా ఉంటుందో తెలిసిందే, అవే చివరకు పవన్ పై విమర్శలకు కారణం అవుతున్నాయి, ఐదు నెలల వైసీపీ పాలనకు చంద్రబాబు పవన్ కల్యాణ్ తట్టుకోలేకపోతున్నారు అనేది తెలుస్తోంది.

అయితే చంద్రబాబు ఇలా పవన్ కల్యాణ్ ను వెనకేసుకు రావడం పై అందరూ ఆశ్చర్యపోయారు.. వైసీపీ చేస్తున్న ఆరోపణలకు నేడు బాబుగారు మంచి ఉదాహరణ చూపించారు అని అంటున్నారు. అయితే బాబు పొత్తు లేకుండా ఎప్పుడు గెలవరు, ఈ ఎన్నికల్లో కూడా పొత్తులు లేకుండా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దీంతో ఇప్పటి నుంచే పవన్ తొ పొత్తు పెట్టుకుంటే బెటర్ అని చెబుతున్నారు కొందరు మేధావులు, మొత్తానికి బాబుని పల్లెత్తి మాట అంటే పవన్ కల్యాణ్ ఫైర్ అవుతారు, ఇక పవన్ కల్యాణ్ పై విమర్శలు చేస్తే బాబు ఫైర్ అవుతారు, మంచి పొలిటికల్ ఫ్రెండ్స్ ఇద్దరు అంటున్నారు వైసీపీ నేతలు

Latest Updates

More...

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.