తాడిపత్రిలో పెద్దారెడ్డి సంచలన నిర్ణయం

Pedda Reddy sensational decision in a tadipatri

అనంతపురం జిల్లాలో ఈ స్టేట్ మెంట్ ఓ పెద్ద సంచలనం క్రియేట్ చేస్తోంది.. వైసీపీలో చేరేందుకు ఈనెల 20వ తేదీ నుంచి ద్వారాలు తెరుస్తామని ఎవరైనా పార్టీలో చేరవచ్చునని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తెలిపారు. ఇది తెలుగుదేశం పార్టీ నేతలకు ఓపెన్ ఆహ్వానం అని తెలుగుదేశం నేతలు అంటున్నారు.. ఓటమిలో ఉన్న టీడీపీ నేతలు ముఖ్యంగా జేసీ అనుచరులు ఇప్పుడు చాలా సైలెంట్ అయ్యారు. ఇటు అనంతపురం జిల్లాలో జేసీ ఫ్యామిలీ పరిటాల ఫ్యామిలీ రాజకీయాలు ఇక నడవవు అంటున్నారు ఇక్కడ వైసీపీ నేతలు, ఇప్పటి వరకూ ఎవరు అయితే నష్టపోయారో వారు నేరుగా కంప్లైంట్ ఇవ్వచ్చు అని అంటున్నారు.

తాజాగా తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి మాట్లాడుతూ పార్టీలో చేరేందుకు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదన్నారు. సరాసరి తనవద్దకు వచ్చి పార్టీలో చేరవచ్చునన్నారు. కేవలం తాడిపత్రి మున్సిపాలిటీలోని వారికి మాత్రమే ఈ అవకాశం కల్పించామని తెలిపారు. జూలై 5నుంచి తాడిపత్రిలో మట్కా కనబడకూడదని పోలీసులను హెచ్చరించారు. ఎవరైనా మట్కా చేస్తున్నారు అని తెలిస్తే ఊరుకునేది లేదు అన్నారు. ఇక పోలీసులకు చెబుతున్నాం అని? ఇక్కడ తాడిపత్రిలో ఎవరైనా మట్కాకు పాల్పడితే ఊరుకునేది లేదు అని చెప్పారు. ఇక పోలీసులు వీటిని అరికట్టాలి అని నేరుగా చెప్పారు.

ఇది ఆపకపోతే వైసీపీ తరపున వార్డుకు ముగ్గురు నుంచి ఐదుగురిని నియమించి మట్కా రాసేవారిని అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించడం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకూ మట్కా చేసిన వారికి సమయం లేదని ఇక ఇలాంటి అరాచకాలకు వసూళ్లకు మాముళ్లకు ఎవరైనా పాల్పడితే అన్యాయాలు చేయాలని చూస్తే జైలుకి వెళతారు అని చెప్పారు. జేసీ అనుచరులకు నేరుగానే వార్నింగ్ ఇచ్చినట్లు అయింది. వైసీపీ పేరుతో బెదిరిపులకు దిగుతున్నారని, మాజీ ఎంపీ తనయుడు జేసీ పవన్ ఆరోపణల్లో నిజం లేదన్నారు. అసలు ఇలాంటివి జరిగేతే తన దృష్టికి నేరుగా తీసుకురావచ్చు అని చెప్పారు. స్పర్శ పేరుతో విరాళాలు సేకరించి కొనుగోలు చేసిన వాటిని తిరిగి తీసుకోవడం జేసీ వర్గీయులకే చెల్లుతుందన్నారు. పట్టణంలోని వెనుకబడిన 15 వార్డుల్లో మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసి రూ.2లకే క్యాన్ నీటిని అందజేస్తామని తెలిపారు. ఇక జేసీ కుటుంబానికి వారి రాజకీయాలకు చెక్ పెట్టేందుకు పెద్దారెడ్డి దూకుడు చూపిస్తున్నారు అని అంటున్నారు.

Latest Updates

More...

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.