
పీఎం కిసాన్‌తో 3 అదిరిపోయే బెనిఫిట్స్ అవేంటో చుడండి
కేంద్ర ప్రభుత్తం అందిస్తున్న పీఎం కిసాన్ స్కీమ్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే దీని గురించి పూర్తిగా అన్ని వివరాలు తెలియకపోవచ్చు. ఈ పథకం వల్ల రూ.6 వేలు కాకుండా మరో మూడు ప్రయోజనాలు పొందొచ్చు.
ప్రధానాంశాలు:
- పీఎం కిసాన్‌తో 3 లాభాలు
- పెన్షన్ స్కీమ్‌లో ప్రత్యేకంగా చేరాల్సిన అవసరం లేదు
- కిసాన్ క్రెడిట్ కార్డులు పొందొచ్చు
- అన్నదాతలకు ప్రత్యేక ఐడీ కార్డ్స్
మోదీ సర్కార్ రైతులకు ఆర్థిక సాయం అందించాలనే లక్ష్యంతో ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా రూ.75 వేల కోట్లు అందించింది. ఈ స్కీమ్ కింద ప్రయోజనం పొందే రైతుల సంఖ్య దాదాపు 10 కోట్లుగా ఉంది. ఇది పాపులర్ పథకం. ఇందులో రిజిస్టర్ చేసుకున్న రైతులు సంవత్సరానికి మూడు ఇన్‌స్టాల్‌మెంట్లలో రూ.6,000 పొందొచ్చు.
కేవలం రూ.6 వేలు మాత్రమే కాకుండా ఈ స్కీమ్ కింద మరో మూడు అదిరిపోయే బెనిఫిట్స్ కూడా పొందొచ్చు. అవేంటో ఒకసారి చూద్దాం. మొదటిది కిసాన్ క్రెడిట్ కార్డు. కేసీసీ కిసాన్ క్రెడిట్ కార్డు కలిగిన వారికి కూడా రూ.6 వేలు వస్తాయి. ప్రస్తుతం ఇప్పటి దాకా 7 కోట్ల మంది రైతులకు కిసాన్ కార్డులు ఉన్నాయి. ఈ కార్డు కలిగిన వారు రూ.3 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. అది కూడా 4 శాతం వడ్డీకే తీసుకోవచ్చు.
Also Read: పేదలకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్‌లో ఉన్న రైతులు పీఎం కిసాన్ మాన్‌ధన్ యోజన పథకంలో సులభంగానే చేరొచ్చు. ఎలాంటి డాక్యుమెంట్లు అందించాల్సిన అవసరం లేదు. ఈ స్కీమ్ ప్రీమియం మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం అందించే రూ.6 వేల నుంచే చెల్లించొచ్చు. ఇది పెన్షన్ స్కీమ్. ఇందులో చేరితో సంవత్సరానికి రూ.36 వేల పెన్షన్ తీసుకోవచ్చు.
దీని కోసం నెలకు కొంత చెల్లించాలి.ఇక చివరిగా కేంద్ర ప్రభుత్వం రైతులకు మరో బెనిఫిట్ కూడా ఆఫర్ చేస్తోంది. పీఎం కిసాన్ స్కీమ్‌లోని రైతుల డేటా ఆధారంగా అన్నదాతలకు ప్రత్యేకమైన ఐడీలు అందించాలని భావిస్తోంది. అంటే రైతులకు ప్రత్యేకమైన ఐడెంటిటీ కార్డు ఇవ్వాలని యోచిస్తోంది. దీని ద్వారా రానున్న రోజుల్లో కొత్తగా ఏమైనా స్కీమ్స్‌ను తీసుకువస్తే.. వాటిని రైతులకు అందించడం సులభతరం అవుతుంది.
Recent News
Latest Updates
- నారా రోహిత్, శ్రీ విష్ణు (హీరో మిత్రుల) చేతుల మీదుగా థౌసండ్ మూన్స్ ఇన్ఫ్రా ఘన ప్రారంభం
- పటారు పాలెం ప్రేమ కథ మూవీ రివ్యూ
- ప్రియురాలు కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి “విక్రమ్” సినిమా
- ఏపీ ప్రభుత్వంపై వర్మ సెటైర్లు..ఉప్మా, ఇడ్లీ, చీరల రేట్లు కూడా ఫిక్స్ చేస్తారా? YS Jagan
- చిచ్చురేపిన సోషల్ మీడియా పోస్ట్, తీవ్ర ఉద్రిక్తత…బాలయ్య ఇంటిని ముట్టడించిన వైసీపీ
- తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వు…జగన్ బెయిల్ రద్దుపై
- చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తున్నారా..?చంద్రబాబు లెక్క తప్పిందా..?
- లేఖ రాసిన సీఎం జగన్… ఏపీలో పింఛన్ తీసుకునేవారికి గుడ్‌న్యూస్