గంటా పొలిటికల్ జర్నీలో కీలక స్టెప్

గంటా పొలిటికల్ జర్నీలో మరో మైలురాయి అవబోతోందా అంటే అవుననే అనలిస్టులు అంటున్నారు.. విశాఖ జిల్లాలో చరిష్మా ఉన్న నాయకుడిగా గంటా పేరు చెప్పాలి. అయితే ఆయన ఎక్కడ ఉన్నా అధికారం ఉంటుంది. అంటే అధికారంలో ఉన్న పార్టీలో ఆయన ఉంటారు. కాని ఏపీలో తెలుగుదేశం పార్టీకి అధికారం దూరం అయి ఐదు నెలలు దాటింటి , కాని గంటా సైలెంట్ గా టీడీపీలోనే ఉన్నారు, అయితే ఆయన కొద్ది రోజులుగా వైసీపీలో చేరుతారు అని వార్తలు వినిపించాయి. కాని అది కూడా వాస్తవం కాలేదు. ఇఫ్పుడు ఉన్న పరిస్దితుల్లో తెలుగుదేశంలో ఉంటే ఆయన పర్సనల్ కేడర్ కు కాస్త కష్టమే అని తెలుస్తోంది.

అందుకే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ లేదా స్టేట్ లో రూలింగ్ లో ఉన్న పార్టీలోకి చేరాలి అని ఆయన ఆలోచన.. అందులో భాగంగా బీజేపీలోకి ఆయన చేరడం దాదాపు కన్ఫామ్ అయింది అని వార్తలు వస్తున్నాయి. గంటా ప్రజారాజ్యం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్లో విలీనం తర్వాత మంత్రి అయ్యారు. 2014 ఎన్నికల ముందు టీడీపీలో చేరారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి అయ్యారు.ఇలా అవకాశాలు అన్నీ ఆయన చుట్టూనే తిరిగాయి, అయితే 2019లో మాత్రం బొమ్మ మారింది. ఎమ్మెల్యేగా గెలిచారు కాని ఆయన పార్టీ అధికారంలోకి రాలేదు. ఐదు నెలలుగా ఎన్ని వార్తలు వచ్చినా ఆయన మాత్రం చిరునవ్వుతో దేనికి సమాధానం ఇవ్వడం లేదు..దీంతో అక్కడ కేడర్కు కూడా అయోమయం వస్తోంది.

అయితే చిరుతో మాత్రం గంటా మంచి సత్సంబంధాలు కలిగి ఉన్నారు, చిరు సీఎం జగన్ ని కలిసిన సమయంలో గంటా కూడా వెళతారు అని వార్తలు వచ్చాయి.. చంద్రబాబు వద్దు అన్నారో ఏమో కాని గంటా మాత్రం రాలేదు. ఇక తర్వాత బీజేపీ కీలక నేత జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్తో గంటా శ్రీనివాసరావు దిగిన ఫోటో వైరల్ అయింది, ఇటీవల టీడీపీ సర్వసభ్య సమావేశానికి కూడా గంటా హాజరుకాకపోవడంతో పార్టీలో ఆయన మీద టీడీపీ నేతల్లో డౌట్లు మొదలయ్యాయి. అయితే వైసీపీ నేతలతో చర్చలు జరుపుతున్నారు అనేది మాత్రం వాస్తవం కాదట. ఆయన బీజేపీలోకి చేరాలని భావిస్తున్నారట. ఈనెల 10 న జేపీ నడ్డా సమక్షంలో ఆయన చేరే అవకాశం ఉంది.. లేకపోతే అమిత్ షాతో భేటీ అయి పార్టీలో చేరే అవకాశం ఉందంటున్నారు. ఈనెలలో గంటా ఏదో ఓ క్లారిటీ అయితే ఇవ్వనున్నారు.

Latest Updates

More...

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.