janampulse
Breaking News

దారుణంగా రేటు పెంచేసిన పూజా

Pooja hegde increase the remuneration

దీపం ఉండగానే ఇళ్లు చక్కపెట్టుకోవాలి అంటారు , అందుకే సినిమా పరిశ్రమలో వారు ఇది బాగా ఫాలో అవుతారు, తాజాగా పలువురు భామలు నాలుగు ఐదు సినిమాలు చేసి మళ్లీ ఎక్కడా కనిపించడం లేదు. అందుకే అవకాశాలు ఉన్నప్పుడే చక్కగా సెటిల్ అవ్వాలి అని చూస్తున్నారు. పైగా దర్శక నిర్మాతలు కూడా కొత్త ఫేస్ లను చూపించాలని చూస్తున్నారు.. ఈ సమయంలో టాలీవుడ్ లో ముకుంద సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయిన పూజా హేగ్దే గురించి ఓ వార్త వైరల్ అవుతోంది.

తొలి సినిమా పెద్ద సక్సస్ రాలేదు ఆమెకు, దీంతో ఈ భామ ప్లైట్ ఎక్కి బాలీవుడ్ కు వెళ్లింది… అక్కడ మొదటి సినిమానే స్టార్ హీరో హృతిక్రోషన్ సరసన మొహంజోదారో సినిమాలో నటించింది. ఏకంగా 18 నెలలు కాల్షీట్లు ఇచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచింది.
కాని సినిమా ప్లాప్ అవ్వడంతో ఆమె మళ్లీ తెలుగు పరిశ్రమలో వాలింది.

ఇక వరుసగా ప్రిన్స్ -ఎన్టీఆర్ -వరుణ్ తో సినిమాలు చేసి తెలుగులో బీజీ హీరోయిన్ అయిపోయింది. ఇక పూజా సక్సస్ పెరగడంతో ఆమె రెమ్యూనరేషన్ కూడా అమాంతం పెంచేసిందట..ప్రభాస్ తో అప్ కమింగ్ సినిమాకి గాను పూజా రెండు కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. జిల్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా చేస్తున్నారు ఈ సినిమాలో ఆమె ఫిక్స్ అయింది. ఇక సెట్స్ పై ఉన్న అల వైకుంఠపురములో నటిస్తోంది. ఆ తర్వాత అఖిల్ సినిమాలో సైతం ఆమె హీరోయిన్గా ఎంపికైన సంగతి తెలిసిందే.. సో ఆమె చేతినిండా సినిమాలు ఉన్నాయి. ఎవరైనా సినిమా అని వస్తే మినిమం ఈ భామకు రెండు కోట్లు ఇవ్వాల్సిందేనట.

Recent News

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.