పరిటాల కుటుంబం పై ఒత్తిడి డైలమాలో మాజీ మంత్రి

Pressure on paritala family

ఏపీలో వైయస్ జగన్ పాలన స్టార్ట్ అయింది. దీంతో ఏపీలో తెలుగుదేశం పార్టీ ఈసారి ఓటమితో తన పార్టీ పరిస్దితి ఏమిటా అని ఆలోచనలో ఉంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఏపీలో ఎలాంటి పరిస్దితి ఉందో తెలిసిందే, పెద్ద చెప్పవలసిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీకి పెద్ద ఎత్తున ఉన్న నేతలు అందరూ కూడా బీజేపీ వైపు అడుగులు వేస్తున్న సమయం. ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులు జెండా మార్చి కండువా కప్పుకున్నారు. పార్టీ తరపున వచ్చిన పదవులకి రాజీనామా చేయలేదు.

ఇక తెలుగుదేశం నేతలు మాజీ ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరుతున్నారు. అంబికా కృష్ణ కూడా అదే దారి చూసుకున్నారు. ఈ సారి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలో 15 మంది బీజేపీలో చేరాలి అని భావిస్తున్నారట. ఓ పక్క జగన్ రాజీనామా చేస్తే పార్టీలో చేరాలి అని కండిషన్లు పెడుతున్న వేళ, వైసీపీకి కాకుండా బీజేపీలోకి వెళ్లాలి అని భావిస్తున్నారు. ఇక జగన్ కూడా పలువురు సీనియర్ అధికారులను తన పరిపాలనలో నియమించుకున్నారు..రాయలసీమలో ఇకపై ఎలాంటి భయాలు ఉండవని, అందరు సమానమే అని చెబుతున్నారు.. తరతరాలుగా వస్తున్న ఫ్యాక్షన్స్ రాజకీయాలకు స్వస్తి పలకాల్సిందే అని ఖరాఖండిగా చెప్పారు. ఇక సీమ జిల్లాల్లో కూడా ఇప్పుడు రాజకీయ అలజడి కనిపిస్తోంది.

నేతల వలసల మాటలు వినిపిస్తున్నాయి. జగన్ సీఎం అయిన తర్వాత అనంతపురం జిల్లాలో పరిటాల ఫ్యామిలీ ఓటమి పాలయ్యాక.. సెక్యూరిటీ విషయంలో జగన్ కు లేఖ రాయగా.. వెంటనే ఆ ఫ్యామిలీకి సెక్యూరిటీని పెంచారు. ఎవరు తనకు శత్రువులు కారని దీనిద్వారా తెలియజేయడంతో ఇప్పుడు అందరూ సమానమే అని చెప్పకనే చెప్పారు జగన్..ఇక జగన్ సెక్యూరిటీ పెంచడంతో ఇటు రాజకీయంగా రెండు పార్టీలు అలాగే పరిటాల కుటుంబం కూడా ఆనందంలో ఉంది.

ఇక పరిటాల శ్రీరామ్ కు సీటు ఇచ్చిన చంద్రబాబు కుటుంబానికి ఒక సీటు అనే కండిషన్ పెట్టి మాజీ మంత్రి సునీతకు చంద్రబాబు టికెట్ ఇవ్వలేదు..దీంతో ఆమె పోటీ నుంచి తప్పుకుని కుమారుడికి అవకాశం ఇచ్చారు.. కాని జేసీ కుటుంబంలో మాత్రం రెండు సీట్లు ఇచ్చారు. ఇలా కొందరికి మాత్రం పెద్ద పీట వేశారు బాబు. అయితే ఐదు సంవత్సరాలు అధికారం ఉండదు.ఇక ప్రతిపక్షంలో ఉన్నాము కాబట్టి కచ్చితంగా పరిటాల కుటుంబానికి ఆమె అనుచరులు పార్టీ మారిపోవాలి అని చెబుతున్నారట. ఈ సమయంలో అనంతపురం జిల్లా బాధ్యతలు ఇస్తాము అని బీజేపీ నేతలు చెబుతున్నారట. జిల్లా పార్టీ బాధ్యతలు పరిటాల కుటుంబానికి ఇవ్వాలి అని చూస్తున్నారు. పెనుగొండ రాప్తాడులో మంచి బలం ఉంది. అలాగే జిల్లాలో రాజకీయంగా పేరున్న కుటుంబం. మొత్తానికి వారు బీజేపీలోకి చేరితే జిల్లాలో కచ్చితంగా వచ్చే ఎన్నికల సమయానికి బీజేపీ మరింత బలోపేతం అయ్యేందుకు పక్కా ప్రణాళిక వేస్తోందట. మరి ఆ ఫ్యామిలీ కూడా డైలమాలో ఉంది అని జిల్లాలో పరిటాల అభిమానులు చెబుతున్నారు. చూడాలి వచ్చే రోజుల్లో వారి పొలిటికల్ స్టెప్స్ ఎలా ఉంటాయో.

Latest Updates

More...

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.