janampulse

ప్రియాంక హంతకులపై రాళ్ల దాడి: షాద్‌నగర్ పీఎస్‌ వద్ద హైటెన్షన్

Priyanka reddy murder case high tension in shadnagar police station

డాక్టర్ ప్రియాంకరెడ్డికి న్యాయం చేయాలంటూ స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. నిందితులను తమకు అప్పగిస్తే తాము చూసుకుంటామని ప్రజలు, ప్రజా సంఘాల నేతలు ఉదయం నుంచి తిండి, నీరు లేకుండా స్టేషన్ వద్దే బైఠాయించారు.
తమకు సహకరిస్తే న్యాయం చేస్తామని డీసీపీ ప్రకాశ్ రెడ్డి స్వయంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ జనంలో ఎలాంటి మార్పు రాకపోవడంతో పాటు పీఎస్‌లోకి చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించడంతో పాటు పోలీసు బలగాలపైకి చెప్పులు విసిరారు. దీంతో తప్పనిసరి పరిస్ధితుల్లో పోలీసులు లాఠీఛార్జీ చేసి ప్రజలను చెదరగొట్టారు.

నిందితులను తమకు అప్పగించాలంటూ విద్యార్థులు, మహిళలు పెద్దెత్తున వచ్చారు. దాంతో నిందితులకు వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి కూడా తరలించలేకపోయారు. వైద్యులే స్టేషన్‌కు వచ్చి పరీక్షలు నిర్వహించారు. కోర్టుకు కూడా హాజరుపరచలేకపోయారు. మేజిస్ట్రేటే స్టేషన్‌కు వచ్చి విచారించారు.
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో స్టేషన్ వద్దకు శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి వచ్చారు. ఆందోళ కారులతో చర్చించే ప్రయత్నం చేశారు. నిందితుడికి మరణశిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు.

రిమాండ్ విధించడంతో చర్లపల్లి జైలుకు నిందితులను తరలించారు. ఆ సమయంలో నిరసన కారులను పోలీసులు లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. అయినప్పటికీ విద్యార్థులు వెనక్కు తగ్గలేదు. నిందితుల బస్సు బయటకు రాగానే రాళ్ల దాడికి దిగారు.

ఇకపోతే స్టేషన్ చుట్టూ ఆందోళన కారులు ఉండటంతో పోలీసులు నిందితులను ఆస్పత్రికి తీసుకెళ్లలేని పరిస్థితి నెలకొంది. దాంతో స్టేషన్లోనే ప్రభుత్వ వైద్యులు శ్రీనివాస్, సురేందర్ లు వచ్చి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం మేజిస్ట్రేట్ ముందు నిందితులను హాజరుపరచగా.. ఆయన వారికి 14 రోజుల రిమాండ్ విధించారు. 

Recent News

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.