janampulse

అంధత్వం లక్ష్యానికి అడ్డు కాదు.. సీఎం జగన్ను కలిసిన యువ ఐఏఎస్ సింహాచలం

ysjagan-simhachalam

వైఎస్‌ జగన్ చూపిన ఆప్యాయత నూతనోత్తేజాన్ని ఇచ్చిందని యువ ఐఏఎస్‌ కట్టా సింహాచలం అన్నారు. అంధత్వాన్ని తాను ఏనాడూ సమస్యగా భావించలేదని స్పష్టం చేశారు. 2019 ఏపీ కేడర్‌కు చెందిన ప్రొబేషనరీ ఐఏఎస్‌లు శనివారం సీఎం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా

Also Read జగన్ మాస్ విక్టరీకి రిజల్ట్.ఆమె నూటికి ఎన్ని మార్కులేశారంటే!

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిశారు. అనంతరం సింహాచలం మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఉత్తమ పాలన అందించేలా ఉన్నాయన్నారు. గ్రామస్వరాజ్య స్థాపనకు సచివాలయ వ్యవస్థ అద్భుతంగా ఉపయోగపడుతుందని కట్టా సింహాచలం అభిప్రాయపడ్డారు. దిశా చట్టం మహిళలు సురక్షితంగా ఉండేందుకు భరోసా కల్పిస్తోందన్నారు.

అంధత్వాన్ని తాను ఏనాడూ సమస్యగా భావించలేదని, అంగవైకల్యం లక్ష్యానికి ఆటంకం కాదనేందుకు తానే నిదర్శనమని చెప్పారు. సొంత రాష్ట్రంలో ఐఏఎస్‌గా అవకాశం రావటం తన అదృష్టమని సింహాచలం సంతోషం వ్యక్తం చేశారు.తాను డాక్టర్ కావాలనుకున్నానని, కానీ కంటిచూపు సమస్యతో సాధ్యం కాలేదని కట్టా సింహాచలం పేర్కొన్నారు. ప్రజాసేవ చేయాలన్న పట్టుదలతో ఐఏఎస్‌ సాధించానని, లోపాలు ఉన్నవారిని ఇబ్బంది పెట్టకుండా ప్రోత్సహిస్తే దేన్నైనా సాధిస్తారని చెప్పారు.

తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలం గూడపల్లికి చెందిన కట్టా సింహాచలం పుట్టుకతోనే అంధుడు. నిరుపేద కుటుంబానికి చెందిన ఆయన పట్టువదలని దృఢ సంకల్పంతో ముందుకు సాగి ఐఏఎస్‌గా ఎంపికయ్యారు. 2019 ఐఏఎస్‌ బ్యాచ్‌లో 457వ ర్యాంకు సాధించి తన కలను సాకారం చేసుకున్నారు.

Recent News

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.