పీవీపీ వర్సెస్ బండ్ల అసలు గొడవేమిటి

PVP verses Bandlaganesh

సినీ నిర్మాత బండ్ల గణేష్ ఎప్పుడూ మీడియాలో వార్తల్లో ఎక్కుతూ ఉంటారు..ఆయన పేరు తెలియని వారు ఉండరు, ట్రంప్ ని కూడా కలిసి ఫోటో తీసుకురాగలను అని తనకు అంత నెట్ వర్క్ ఉంది అంటారు బండ్ల గణేష్, ఇక తెలంగాణ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరి, ఆ పార్టీ తరపున ఎన్నికల ప్రచారం కూడా చేశారు, అనేక స్టేట్ మెంట్లు ఇచ్చారు, కాని తర్వాత రాజకీయాలకు గుడ్ బై చెప్పారు, ఇప్పుడు ఆయనపై అతని అనుచరులపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. టెంపర్ నిమాకు సంబంధించి సినీ ఫైనాన్షియర్, సహ నిర్మాత పొట్లూరి వరప్రసాద్.. బండ్ల గణేష్కు రూ.30 కోట్లు పెట్టుబడి పెట్టారు. సినిమా విడుదల సమయంలో 23 కోట్లు చెల్లించారు మిగిలిన ఏడు కోట్ల రూపాయలు తనకు చెల్లించడం లేదని పీవీపీ ఆరోపణ.

గణేష్కు సంబంధించిన కొంతమంది వ్యక్తులు పీవీపీ ఇంటికి వెళ్లి ఆయనపై బెదిరింపులకు పాల్పడ్డారు.. దీంతో శుక్రవారం రాత్రి పీవీపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు, గణేష్తో పాటు అతని అనుచరులపై ఐపీసీ 448, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తనపై కేసు నమోదైన విషయం తెలుసుకున్న బండ్ల గణేష్ పరారీలో ఉన్నారని తెలుస్తోంది. ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు..ఇలా బండ్లగణేష్ పై విమర్శలు ఆరోపణలు రావడంతో మళ్లీ సోషల్ మీడియాలో ఆయన కనబడటం లేదు అంటూ పోస్టులు వైరల్ అవుతున్నాయి.

ఇటు మెగా కుటుంబానికి ఆయనని మెగా నిర్మాతగా పిలుస్తారు అందరూ,గబ్బర్ సింగ్ సినిమా పవన్ కల్యాణ్ తో చేసి మంచి బ్లాక్ బ్లాస్టర్ హిట్ అందుకున్నారు బండ్ల, అయితే ఇప్పుడు పవన్ మరో ఐదు సంవత్సరాలు రాజకీయంగా కాస్త ఖాళీగానే ఉంటారు, దీంతో పవన్ కల్యాణ్ తో ఈ సమయంలో మరో సినిమా చేయాలని చూస్తున్నారు. కాని ఇలా పలు కేసులు ఆయన మెడకు చుట్టుకోవడం పెద్ద చర్చకు కారణం అయింది. ఇక పీవీపీ కూడా ఇటీవల ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున విజయవాడ పార్లమెంట్ స్ధానానికి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయినా ఆయన వైసీపీ తరపున చాలా యాక్టీవ్ గా ఉన్నారు. మరి పీవీపి – బండ్ల మధ్య ఈ వివాదానికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి.

Latest Updates

More...

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.