
బ్యాంకు కస్టమర్లకు ఊరట ఆర్బీఐ సంచలన ప్రకటన
దేశంలో అత్యంత దారుణమైన పరిస్దితి కనిపిస్తోంది, కరోనా వైరస్ తన ప్రతాపం చూపిస్తోంది, ఇళ్ల నుంచి ఎవరిని బయటకు రావద్దు అని చెబుతున్నారు అధికారులు, ముఖ్యంగా ఉద్దీపన ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది.రూ.1.7 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారు. ఇప్పుడు ఆర్‌బీఐ కూడా రంగంలోకి దిగింది. కీలక రెపో రేటును భారీగా తగ్గించింది.
ఈ సమయంలో బ్యాంక్ కస్టమర్లకు కాస్త ఊరటనిచ్చింది అని చెప్పాలి. బ్యాంక్ కస్టమర్లు మూడు నెలలపాటు ఈఎంఐలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది నిజంగా చాలా ప్రయోజనం కలిగించే చర్య అని చెప్పకోవచ్చు, దేశంలో లోన్లు ఇచ్చిన అన్నీ వాణిజ్య బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు వంటి వాటికి ఇది వర్తిస్తుంది.
అలాగే ఆర్థిక వ్యవస్థను ఆదుకోవడానికి ఆర్‌బీఐ తాజాగా కీలక వడ్డీ రేట్లను తగ్గించింది. రెపో రేటును ఏకంగా 75 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. దీంతో రెపో రేటు 4.4 శాతానికి దిగొచ్చింది.
ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఈ మీటింగ్‌ను ముందుగానే నిర్వహించారు. ఆర్‌బీఐ రెపో రేటుతో పాటు రివర్స్ రెపో రేటును కూడా తగ్గించింది. ఏకంగా 90 బేసిస్ పాయింట్ల కోత విధించింది. దీంతో రివర్స్ రెపో రేటు 4 శాతానికి తగ్గింది. ఇక ఇది క్రెడిట్ కార్డుల పేమెంట్లకి సంబంధం ఉండదు అని అంటున్నారు, కేవలం బైక్ ఇంటికి ఫర్నిచర్ ఇలా అనేక లోన్లు తీసుకున్న వారికి ఈ ఈఎం ఐలు ఎవరికి అయితే ఉన్నాయో వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది, ఏప్రిల్ 1 నుంచి ఇది జూన్ వరకూ ఎవరికి ఈఎంఐలు ఇబ్బంది ఉండదు, తర్వాత ఈ పేమెంట్లని చెల్లించుకోవచ్చు.
Recent News
Latest Updates
- నారా రోహిత్, శ్రీ విష్ణు (హీరో మిత్రుల) చేతుల మీదుగా థౌసండ్ మూన్స్ ఇన్ఫ్రా ఘన ప్రారంభం
- పటారు పాలెం ప్రేమ కథ మూవీ రివ్యూ
- ప్రియురాలు కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి “విక్రమ్” సినిమా
- ఏపీ ప్రభుత్వంపై వర్మ సెటైర్లు..ఉప్మా, ఇడ్లీ, చీరల రేట్లు కూడా ఫిక్స్ చేస్తారా? YS Jagan
- చిచ్చురేపిన సోషల్ మీడియా పోస్ట్, తీవ్ర ఉద్రిక్తత…బాలయ్య ఇంటిని ముట్టడించిన వైసీపీ
- తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వు…జగన్ బెయిల్ రద్దుపై
- చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తున్నారా..?చంద్రబాబు లెక్క తప్పిందా..?
- లేఖ రాసిన సీఎం జగన్… ఏపీలో పింఛన్ తీసుకునేవారికి గుడ్‌న్యూస్