సీమలో టీడీపీకి రెడ్లు గుడ్ బై

Reddy's Goodbye to Telugu Desam Party

రాయలసీమ అంటేనే రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉంటుంది.. రాజకీయంగా వైరి వర్గాలు కూడా ఎన్ని పార్టీలు ఉన్నా రెడ్డి సామాజిక వర్గం నుంచి ఎక్కువ మంది ఉంటారు.. అయితే ఈసారి తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో గెలిచిన సీట్లు చూస్తే అసలు రాష్ట్రంలో అన్నీప్రాంతాల ప్రజలు కూడా షాక్ అయ్యారు. ముఖ్యంగా చంద్రబాబు 40 ఏళ్ల అనుభవం అని చెప్పి 40 ఏళ్ల వయసు ఉన్న జగన్ పై ఓటమి పాలయ్యారు. ఇక తెలుగుదేశం పార్టీకి కమ్మసామాజిక వర్గం వైసీపీకి రెడ్డి సామాజిక వర్గం సపోర్ట్ అని అంటారు. నిజంగా ఇలా ఉంటే ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చేదా, ఇది అంతా కేవలం ప్రచారం అని చెప్పాలి. అన్నీ కులాలు అన్నీ పార్టీలకు సపోర్ట్ నిలుస్తాయి అనేది తెలిసిందే.

ఇక ఈ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు చూస్తుంటే రాయలసీమలో తెలుగుదేశంపార్టీ విచిత్రమైన పరిస్దితి ఎదుర్కొంటోంది అని చెప్పాలి.. ఏ పార్టీ అధికారంలో ఉన్నా మొదటి నుండి రెడ్డి సామాజికవర్గానిదే రాయలసీమలో ఆధిపత్యం అన్న విషయం కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.. టిడిపి కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. పార్టీ సారధ్య బాధ్యతలు కమ్మ సామాజికవర్గం చేతిలోనే ఉన్నా రాయలసీమ వరకూ రెడ్లదే ఆధిపత్యం. అందుకే అక్కడ రెడ్లు పొలిటికల్ యాక్టీవ్ గా ఎక్కువ ఉంటారు. కాబట్టి అక్కడ కూడా బాబు వారికి అవకాశం ఇచ్చారు. కాని ఇప్పుడు ఈ క్లీన్ విక్టరీ చూసిన తర్వాత జగన్ పై తాము పోరాటం చేయగలమా అని డైలమాలో ఉన్నారు అక్కడ టీడీపీ నేతలు.

ఇక చంద్రబాబు కావాలనే రెడ్డి సామాజిక వర్గం చేత ,జగన్ పై విమర్శలు చేస్తున్నారు అని, కావాలనే రెడ్డి చేత జగన్ ని తిట్టిస్తున్నారు అని విమర్శలు వచ్చాయి. ఈ అంశం కూడా ఓటు బ్యాంకు దూరం అవడానికి ఎన్నికల్లో ప్రధాన కారణం అని చెప్పాలి.. మొత్తం సీమలో నాలుగు జిల్లాల నుంచి ఒక్క రెడ్డి కూడా ఈఎన్నికల్లో గెలవలేదు..రాయలసీమలోని 52 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టిడిపి నుంచి 20 మంది రెడ్లు పోటీ చేశారు.. అయితే ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా గెలవలేదు. దీంతో తెలుగుదేశం పార్టీకి ఎలాంటి పరిస్దితి ఇక్కడ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.

రాయలసీమలోని 8 ఎంపి సీట్లలో పోటి చేసిన రెడ్డి అభ్యర్ధుల్లో కూడా ఏ ఒక్కరూ గెలవకపోవటం విచిత్రం అని చెప్పాలి, జేసీ కుటుంబం కోట్ల కుటుంబం, భూమా కుటుంబం, గౌరు కుటుంబం, ఇలా ఎవరూ కూడా టీడీపీలో గెలుపొందలేదు. ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి, బొజ్జలకు దారుణమైన ఓటమి వచ్చింది.. దీంతో వారసులు కూడా టెన్షన్ పడుతున్నారు. అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు బాగానే ఉన్నారు, కాని ఇప్పుడు మాత్రం వీరి పరిస్దితి మరింత దారుణంగా ఉంది అంటున్నారు అక్కడ రాజకీయ విశ్లేషకులు.

Latest Updates

More...

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.