
రేవంత్ రెడ్డి ఆశలపై నీళ్లు చల్లిన సోనియా
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఎవరు వస్తారు అనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.. ముఖ్యంగా దూకుడు చూపిస్తున్న రేవంత్ రెడ్డి పేరు కొందరు వినిపిస్తున్నారు, కాని అతనికి పదవి ఇస్తే పార్టీలో సగం మంది జంప్ అవుతారు అని అధిష్టానానికి చెబుతున్నారు.. ఏదూకుడు అయితే చూపిస్తున్నారో రేవంత్ కు అదే మైనస్ అవుతోంది. గత రెండు నెలల క్రితం రేవంత్ పేరు సోనియా కూడా పరిశీలించారు.. కాని ఇప్పుడు సోనియా కూడా రేవంత్ ని పక్కన పెట్టేశారు అని అంటున్నారు.
తాజాగా ఎంపీ రేవంత్ రెడ్డి వ్యవహారంపై పరిణామాలు మారాయి. భూ ఆక్రమణలు అవినీతి అక్రమాలు బయటపడడంతో అధిష్టానం పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. దీంతో తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవికి రేవంత్ రెడ్డి అర్హుడు కాదని ఏఐసీసీ తేల్చినట్టు సమాచారం. ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఢిల్లీలో పార్టీ అధిష్టానాన్ని కలిశారు పూర్తిగా తెలంగాణలో పార్టీ విషయాలు చెప్పారు, ఈ సమయంలో రేసులో ఉన్న వారి గురించి పూర్తి వివరాలు ఆయన నుంచి తెలుసుకున్నారట.
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి కుంతియాతోనూ నివేదిక తెప్పించుకున్నారట. వాటన్నింటిని నిశితంగా పరిశీలించి.. సమాలోచనలు చేసిన తర్వాత రేవంత్ రెడ్డిని పీసీసీ రేసు నుంచి పేరును తొలగించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ దారుణమైన స్దితిలో ఉంది, ఈ సమయంలో పార్టీ చీఫ్ అవినీతి కేసుల్లో ఉంటే.. అధికార పార్టీని ఎలా ప్రశ్నిస్తాడు పార్టీలోనే తప్పుడు సంకేతాలు వెళ్లవా అంటూ సోనియా ప్రశ్నలు వేశారట.
ఓటుకు నోటు కేసుతో పాటు భూ ఆక్రమణలు వంటివి బయటపడ్డాయని గుర్తుచేశారు.. ఒకవేళ కాదు అని రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే కొమటిరెడ్డి సోదరులు పార్టీకి దూరమయ్యే ప్రమాదం ఉంది. వారితో పాటు నల్గొండ జిల్లాలో బలమైన నాయకులు ఇక పార్టీలోని సీనియర్ నాయకులు కూడా పార్టీ వీడే ప్రమాదం ఉంది. దీంతో రేవంత్ ఆశలు అడియాశలు అయ్యాయి అంటున్నారు.
Recent News
Latest Updates
- నారా రోహిత్, శ్రీ విష్ణు (హీరో మిత్రుల) చేతుల మీదుగా థౌసండ్ మూన్స్ ఇన్ఫ్రా ఘన ప్రారంభం
- పటారు పాలెం ప్రేమ కథ మూవీ రివ్యూ
- ప్రియురాలు కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి “విక్రమ్” సినిమా
- ఏపీ ప్రభుత్వంపై వర్మ సెటైర్లు..ఉప్మా, ఇడ్లీ, చీరల రేట్లు కూడా ఫిక్స్ చేస్తారా? YS Jagan
- చిచ్చురేపిన సోషల్ మీడియా పోస్ట్, తీవ్ర ఉద్రిక్తత…బాలయ్య ఇంటిని ముట్టడించిన వైసీపీ
- తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వు…జగన్ బెయిల్ రద్దుపై
- చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తున్నారా..?చంద్రబాబు లెక్క తప్పిందా..?
- లేఖ రాసిన సీఎం జగన్… ఏపీలో పింఛన్ తీసుకునేవారికి గుడ్న్యూస్