janampulse

వైసీపీకి కొత్త బాస్..పార్టీ వ్యవహారాలు ఇక ఆయన కనుసన్నల్లోనే.

YSRCP

ఏడాది క్రితం రాష్ట్రంలో అఖండ విజయంతో  అధికారంలోకి వచ్చిన వైసీపీ ఇప్పుడు పార్టీ పరంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటుంది.ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు అటు పార్టీ పరంగా ఇటు ప్రభుత్వ పరంగా అన్నీతానై నడిపిస్తున్నారు. సీఎంగా పాలనా వ్యవహారాల్లో బిజీగా వున్న జగన్ పార్టీ వ్యవహారాలు చూసేందుకు సమయం కేటాయించలేని పరిస్థితి.

Also Read ప్రజల కోసం ఒక కొత్త వ్యవస్థను తీసుకొచ్చా, మార్పొచ్చింది. సీఎం జగన్

దీంతో పార్టీ పరంగా కింది స్థాయి నేతల వరకు సమన్వయం చేసుకునేందుకు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు.పార్టీలో అధినేత జగన్ తరువాత నెంబర్ టూ గా ఎంపీ విజయసాయి రెడ్డి వ్యవహారిస్తూ వచ్చారు. అయితే 22 పార్లమెంటు స్ధానాలతో దేశంలో నాల్గవ పెద్ద పార్టీగా పార్లమెంటులో క్రియాశీలకంగా మారడంతో విజయసాయి రెడ్డిని ఢిల్లీ వ్యవహారాలు చక్కబెట్టేందుకు పార్లమెంటరీ పార్టీ నేతగా నియమించారు.

కేంద్రంతో వ్యవహారాలను చక్కబెట్టేందుకే విజయసాయిరెడ్డి ఎక్కువ సమయం కేటాయించాల్సిన పరిస్థితి. దీంతో రాష్ట్ర పార్టీ వ్యవహారాలు ఎవరు చూడాలన్న దానిపై స్పష్టత లేకుండా పోయింది. ఈ నేపధ్యంలో పార్టీలో క్రియాశీలంగా ప్రధాన కార్యదర్శిగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డికి పార్టీ బాధ్యతలు అప్పగించాలని అధినేత జగన్ భావిస్తున్నారు.

సజ్జల ప్రస్తుతం ప్రభుత్వానికి ప్రజా వ్యవహారాల సలహాదారుగా కూడా పనిచేస్తున్నారు. ప్రభుత్వ పాలనా వ్యవహారల్లో కొన్ని పనులు ఆయనే చక్క బెడుతూ ఉండటంతో ఇప్పుడు ఆయనకే పార్టీ వ్యవహారాలు కూడా అప్పగించాలని అధినేత జగన్ ఆలోచన చేస్తున్నారు. పార్టీ పరంగా అన్ని ప్రాంతాల నేతలతో సజ్జలకు మంచి సమన్వయం ఉండటంతో జగన్ ఆయన వైపే మొగ్గు చూపుతున్నారు.

సోమవారం నుంచి తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సజ్జల పార్టీ వ్యవహారాలకు పూర్తిస్ధాయి సమయాన్ని కేటాయించేలా ష్యెడ్యూల్ చేసుకున్నట్లు తెలుస్తుంది. పార్టీ వ్యవహారాలతో పాటు మీడియా వ్యహారాలు , ద్వితీయ శ్రేణి నేతలకు సంబంధించిన సమస్యలను కూడా పరిష్కరించేలా సజ్జలకు బాధ్యలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

Recent News

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.