janampulse

రాజుగారి పుత్రిక సంచయిత వైసీపీలో చేరబోతున్నారా

Sanchayita joining to YSRCP

టీడీపీనే కాదు ఇప్పుడు బీజేపీ కూడా సీఎం జగన్ పై దండయాత్ర మొదలు పెట్టింది, ఇదంతా సింహాచలం దేవస్థానం ట్రస్టుబోర్డు అధ్యక్షురాలిగాను, మాన్సాన్ ట్రస్టుకు అధ్యక్షురాలిగానూ కొత్తగా బాధ్యతలు తీసుకున్న సంచయిత గజపతి రాజు నియామకంతో అని చెప్పాలి, ఇక్కడ నుంచి ఈ వివాదం స్టార్ట్ అయింది, అయితే బీజేపీ జగన్ పై విమర్శలు చేస్తోంది.. అలాగే సంచయితని కూడా విమర్శిస్తోంది, ఆమె బీజేపీ నిర్ణయాలకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారు అని అంటున్నారు.

ఈ సమయంలో ఆమె త్వరలోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని మేధావి వర్గం భావిస్తోంది ..బిజెవైఎం కేంద్ర కమిటీలో ఉన్న ఆమె కాషాయ కండువా కాకుండా, వైసీపీ కండువా కప్పుకుంటారా అనే అనుమానం కూడా చాలా మందికి ఈ రెండు రోజులుగా వస్తోంది…విజయనగరం సంస్థానానికి వారసుడిగా గతంలో ఆనందగజపతి రాజు ఉండేవారు.. ఇప్పుడు సంచయిత చేపట్టిన రెండు బాధ్యతలనూ తానే నిర్వహిస్తూ వచ్చారు. ఆయన తర్వాత సోదరుడు అశోక్ గజపతిరాజు ఆ బాధ్యతలు స్వీకరించారు. ఆనందగజపతి రాజు భార్య ఉమ ఆయన బతికి ఉండగానే విడాకులు తీసుకున్నారు. ఆమె కూతురే. ప్రస్తుతం సారథ్యం వహిస్తున్న సంచయిత.
అయితే అశోక్ గజపతి రాజు కుటుంబానికి ఇప్పుడు ఆమెతో సత్సంబంధాలు లేవట,కొంతకాలం క్రితం ఆమె బీజేపీలో చేరి పార్టీ తరపున పని చేస్తున్నారు, ఈ సమయంలో వైసీపీ నుంచి ఆమెకి ఈ పదవులు తీసుకోవాలి అని పిలుపు రావడంతో ఆమె తీసుకున్నారు ఇక్కడే అసలు వివాదం మొదలైంది.

సంచయిత ఇలా పదవులు తీసుకుంటున్నట్లు ఏపీ కాషాయం పార్టీ నాయకులకు సమాచారం ఇవ్వలేదు… అసలు చర్చించలేదు…పైగా ఏమీ పొత్తులు కూడా లేని పార్టీ కాబట్టీ ఎందుకు ఇలా పదవి తీసుకున్నారు? దీనికి ఎవరిని అనుమతి అడిగి తీసుకున్నారు అని ఏపీ బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

వైకాపా ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి ఇంటికివెళ్లి వారితో కలిసి వెళ్లి ప్రమాణస్వీకారం చేసేశారు ఆమె… ఇది బీజేపీకి ఆగ్రహం తెప్పించింది. ఆమె మీద క్రమశిక్షణ చర్య తీసుకోవాల్సిందిగా.. రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పార్టీ కేంద్ర కమిటీకి ఉత్తరం రాశారు. సో ఆమెపై చర్య తీసుకుంటే పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరుతారు అని అంటున్నారు, చూడాలి అప్పన్న ఈ రాజకీయాన్ని ఎలా ముందుకు నడిపిస్తారో.

Recent News

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.