టీడీపీ కి షాక్ బీజేపీలోకి టీడీపీ నేత సోద‌రుడు

Shock to TDP, TDP leader's brother shifted to BJP

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో తెలుగుదేశం నాయ‌కులు కూడా వ‌చ్చే ఎన్నిక‌ల కోసం ఇప్ప‌టి నుంచే త‌మ‌కు సీటు ఏ పార్టీ ఇస్తుందా, ఆ పార్టీలో చేరాలి అని ఆలోచ‌న‌లో ఉన్నారు.. అందులో భాగంగా విజ‌య‌న‌గ‌రం జిల్లా తెలుగుదేశం నేత‌లు ఇప్ప‌టికే త‌మ‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు ఉన్న నాయ‌కులు ఇటు వైసీపీ క‌మ‌లం పార్టీలోకి చేరాల‌ని చూస్తున్నారు.

 
ఇప్పుడు తాజాగా ప్రముఖ వైద్యుడు ద్వారపురెడ్డి రామ్మోహనరావు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్టు బయటకు పొక్కడంతో సర్వత్రా చర్చనీయాంశమైంది..టీడీపీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌కు సోదరుడైన రామ్మోహనరావు బీజీపీలో చేరుతారని ప్రచారం జరుగుతుండడంతో టీడీపీ నేతల్లో కలవరం మొదలైంది.

 

అయితే అన్న‌ద‌మ్ములు ఒకే పార్టీలో ఉంటారు అని భావించిన‌ప్ప‌టికీ ఇలా పార్టీలు మార‌డం పై స‌ర్వ‌త్రా చ‌ర్చ జరుగుతోంది… అయితే పార్టీలో త‌న‌కు స‌రైన గుర్తింపు లేద‌ని ఆయ‌న మ‌ద‌న‌ప‌డుతున్నారని తెలుస్తోంది.. గ‌తంలో ఆయ‌న‌కు ఎమ్మెల్యే టికెట్ ఇస్తాను అని చెప్పి టికెట్ ఇవ్వ‌క‌పోవ‌డం కూడా ఇక్క‌డ ఆయన అల‌క‌కు కార‌ణం అంటున్నారు నాయ‌కులు.

 

ఇక పార్టీలో బాహాటంగా సీఎం చంద్ర‌బాబు ను అనేక‌సార్లు ఆయ‌న విమ‌ర్శించారు.. ఇక ఈ స‌మ‌యంలో ఆయ‌న ఈ నెల 22న జిల్లాకు రానున్న బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నాల‌క్ష్మీనారాయ‌ణ‌ను క‌లిసి ఆయ‌న స‌మ‌క్షంలో పార్టీలో చేర‌నున్నారు అని తెలుస్తోంది… ఇప్ప‌టికే జిల్లా నాయ‌కులు రామ్మోహనరావును మర్యాదపూర్వకంగా కలసి ఆహ్వానించారు.. దీనిపై రామ్మోహనరావును వివరణ కోరగా తాను ఎప్పటి నుంచో బీజేపీలోనే ఉన్నానని చెప్పారు… దీంతో ద్వారపురెడ్డి కుటుంబంలో వేరుకుంపటి తప్పదన్న చర్చ సాగుతోంది.

Latest Updates

More...

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.