janampulse
Breaking News

శ్రేయ ఘోషాల్ రియల్ స్టోరీ

ఆమె పాట పాడిందంటే యువతరం ఉత్తేజితం అవుతుంది ఆమె రాగాలకు కాళ్లతో చేతులతో పదనిసలు ఇవ్వాల్సిందే ఆమెతో స్వరం కలపాల్సిందే మాస్ క్లాస్ మెలోడి ఇలా ఏది అయినా తన స్వరంలో నాట్యం చేస్తాయి ఇండియాలో ఉన్న యంగ్ సింగర్స్ లో ఆమె స్వరలహరి లయంగా వినిపిస్తుంది మరి ఆమె శ్రేయా ఘోషాల్ . మరి ఆమె రియల్ స్టోరీ తెలుసుకుందాం.

శ్రేయ ఘోషాల్ పశ్చిమ బెంగాల్ లోని దుర్గాపూర్లో ఒక హిందూ కుటుంబంలో జన్మించారు. తన బాల్యం రాజస్థాన్ రాష్ట్రం యందున్నకోట పట్టణానికి సమీపంలో కల రావత్ భాట అనే చిన్న పట్టణంలో సాగింది. ఆమె తండ్రి బిశ్వజీత్ ఘోషాల్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లో ఇంజనీరుగా పని చేసేవారు. ఆమె తల్లి సాహిత్యంలో పోస్ట్ – గ్రాడ్యూయేట్. ఇలా ఆమె తల్లి నుంచి ఆమెకు కళల పై ఇష్టం ఉంది.

తన నాల్గవ ఏట నుంచే శ్రేయ ఆమె తల్లి దగ్గరి హార్మోనియం పట్ల ఆసక్తి చూపించారు. ఆమె మహేష్ చంద్ర శర్మ దగ్గర హిందుస్థానీ సంగీతాన్ని నేర్చుకున్నారు. శ్రయ 1996 వ సంవత్సరంలో జీ టీవీలో ప్రసారమయ్యే సరిగమ పిల్లల ప్రోగ్రాంలో విజేత. ఆ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన కల్యాణ్ జీ వీర్ జీ షాహ్ ఆమె తల్లిదండ్రులను ముంబైకి రమ్మని ఒప్పించారు… 1997 వ సంవత్సరంలో ఆమె తండ్రికి ఉద్యోగరీత్యా బదిలీ అయ్యి కుటుంబమంతా ముంబైకి వచ్చింది. శ్రేయ కల్యాణ్ జీ దగ్గర 18 నెలలు శిక్షణ పొంది సాంప్రదాయ సంగీతాభ్యాసాన్ని ముక్తా భీదే దగ్గర కొనసాగించారు.

ఆమె మరల షసరి గ మ ప”లో ప్రవేశించినపుడు సంజయ్ లీలా భంసాలీ (న్యాయనిర్ణేత మరియు ప్రఖ్యాత దర్శకుడు) ని గా ఉన్నారు..తన గాత్రంతో ఆమె ఆయనని ఆకట్టుకున్నారు. 2000 లో భంసాలీ శ్రేయకు “దేవదాసు” చిత్రంలో కథానాయిక పాత్ర , పారోకు గాత్ర దానం చేసే అవకాశం ఇచ్చారు. ఆమె ఆ చలన చిత్రంలో 5 పాటలను ఆలపించారు. ఆ చిత్రంలో “బైరీ పియా ” పాటకు గాను ఆమెకు భారత జాతీయ చలనచిత్ర పురస్కారం లభించింది. అదే చిత్రానికి ఆమెకు ఉత్తమ నేపథ్య గాయనిగా ఉత్తరాది ఫిల్మ్ ఫేర్ పురస్కారం లభించింది.ఇలా ఆమె అప్పటి నుంచి తిరిగి వెనక్కి చూడలేదు, వచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుని టాప్ సింగర్ అయింది.

ఆమె హిందీ లోనే కాకుండా దక్షిణాది భాషలలో ఎన్నో పాటలు పాడారు. ఆమె, తమిళ్ చిత్రం ‘ఆల్బం’ లోని “చెల్లామే చెల్లామ్” అనే పాటతో దక్షిణ భారత చలన చిత్ర సీమ లోకి రంగప్రవేశం చేశారు. ‘ఒక్కడు’ చిత్రంలో “నువ్వేం మాయ చేసావో గాని ” ఆమె మొదటి తెలుగు పాట. ‘బిగ్ బి’ చిత్రంలో “విదా పరయుకాయనో ” శ్రేయ పాడిన మొట్ట మొదటి మలయాళ పాట.. ఇప్పటిదాకా ఆమె పాడిన హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ పాటలకు ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు మరియు మలయాళం, తమిళ్ రాష్ట్ర పురస్కారాలు లభించాయి. 2010 సంవత్సరంలో ఆంగ్ల చిత్రమైన వెన్ హేరీ ట్రైస్ టు మేరీ లో ఆమె పాట పాడారు. తెలుగులో ‘శ్రీ రామ రాజ్యం’ చిత్రంలో పాడిన పాటలు చాలా ప్రఖ్యాతి పొంది వివిధ రకాల శ్రోతల మన్ననలను అందుకున్నాయి.

సోనీ టీవీలో ప్రసారమయ్యే “ఎక్స్ ఫ్యాక్టర్” అనే ఒక స్వర సంగ్రామానికి ప్రఖ్యాత నేపథ్య గాయకుడు సోనూ నిగమ్, సంజయ్ లీలా భంసాలీ లతో కలిసి న్యాయ నిర్ణేతగా శ్రేయ వ్యవహరించారు. అలాగే మ్యూజిక్ కా మహా మూకాబలా అనే పోటీలో ఆమె తన బృందానికి నాయకురాలిగా చాలా చక్కని పాత్ర పోషించారు. ఇప్పటికి ఆమెకు 4 జాతీయ పురస్కారాలు, 5 ఉత్తరాది ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు, 4 దక్షిణాది ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు లభించాయి.హిందీ కాకుండా ఇతర భారతీయ భాషలైన అస్సామీ, కన్నడ, తమిళం, తెలుగు, బెంగాలీ, పంజాబీ, మరాఠీ మరియు మళయాళంలో ఎన్నో పాటలు పాడారు. మరెన్నోపాటలతో ఆమె బిజీ బిజీగా ఉన్నారు.

ఇక ఆమెకంటూ ప్రత్యేకంగా గుర్తింపు ఉంది, ఆమె తెలుగులో కూడా మరిన్ని పాటు పాడాలని ఆశిద్దాం, అలాగే మంచి పాటలతో అవార్డుల పంట పండించాలని కోరుకుందాం.

Recent News

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.