janampulse

ఇక‌పై సినిమాహాళ్ల‌లో ఎమ్మార్పీకే తినుబండారాలు ఈ స్టోరీ చ‌ద‌వండి

Snakes MRP rates only in cinema halls

రాల విక్రయాలు ఎమ్మార్పీ ప్రకారమే జరుగాలని, ఒక్కపైసా ఎక్కువ వసూలుచేసినా కఠిన చర్యలు తప్పవని తూనికలు, కొలతలశాఖ కంట్రోలర్ అకున్‌సబర్వాల్ తీవ్రంగా హెచ్చరించారు.

అతిక్ర‌మిస్తే ఎవ‌రిని ఉపేక్షింమ‌ని భారీ జరిమానాతోపాటు వారు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తేల్చిచెప్పారు. విడిగా విక్రయించే తినుబండారాలు పానీయాల ధర, పరిమాణం వివరాలు స్టిక్కర్ల రూపంలో షాపు ఎదుట కచ్చితంగా నమోదు చేయాలని స్పష్టంచేశారు. సినిమా హాళ్లు, మల్టిప్లెక్సుల్లో తినుబండారాలు అధిక ధరలకు అమ్ముతున్నట్టు కొంతకాలంగా ప్రేక్షకుల నుంచి లీగల్ మెట్రాలజీశాఖకు అనేక ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో వాటికి అడ్డుకట్ట వేయడానికి తూనికలు కొలతలశాఖ పకడ్బందీ చర్యలు చేపట్టింది.

దానిపై ఎంత రేటు ఉంటే అంతే రేటుకు విక్రయించాలని స్పష్టంచేస్తూ ప్రత్యేక ఉత్తర్వులు జారీచేసింది. దీనిపై ఇప్పటికే ఆయాప్రాంతాల్లోని థియేటర్ యాజమాన్యాలకు అవగాహన కల్పించింది. ఆగస్టు ఒకటి నుంచి కొత్త నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని అధికారులను కూడా ఆదేశించింది.
ఇలా అమ్ముతున్నారో లేదో చూసేందుకు ఆగ‌స్టు 2, 3 తేదీల్లో గ్రేటర్ పరిధిలో, 4, 5 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని చెప్పారు. మొదటిసారి కేసు నమోదైతే రూ.25 వేలు, రెండోసారి రూ.50 వేలు, మూడోసారి రూ.1 లక్ష జరిమానాతోపాటు ఆరునెలల నుంచి ఏడాది వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉం టుందని హెచ్చరించారు. ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్ 180042500333, వాట్సప్ నంబర్ 7330774444 విధిగా సినిమా హాళ్లలో ప్రదర్శించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించినట్టు గుర్తిస్తే వినియోగదారులు తమకు సమాచారం అందించాలని ఆయన కోరారు.చూశారుగా ఎవ‌రైనా నిబంధ‌న‌లు అతిక్ర‌మిస్తే ఈ టోల్ ఫ్రీ నంబ‌ర్ కి కాల్ చేయండి

Recent News

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.