వైసీపీలోకి బీజేపీ ఎంపీ కుమారుడు

Son of BJP MP in the YSRCP

వచ్చే ఎన్నికల్లో చాలా వరకూ అసెంబ్లీ సెగ్మెంట్లకు అభ్యర్దులను జగన్ ఫిక్స్ చేస్తున్నారు, కాని ఎంపీ సెగ్మెంట్ల విషయంలో కొన్ని సెగ్మెంట్లు అయితే ఇంకా అభ్యర్ధులను ఫిక్స్ చేయలేదు అని చెప్పాలి.. తాజాగా నరసాపురం ఎంపీ సీటు విషయంలో మూడు సంవత్సరాలుగా ఇక్కడెవరు పోటీ చేస్తారు అని డైలమా అయితే ఉంది.. ఇక్కడ ముదునూరి ప్రసాద్ రాజు బాధ్యతలు చూస్తున్నా, ఆయన ఎంపీగా కాకుండా నరసాపురం ఎమ్మెల్యేగా బరిలో ఉండనున్నారు. మరి ఇక్కడ వంకా రవీంధ్రనాథ్ గత ఎన్నికల్లో ఓటమి చెందారు, మరోసారి జగన్ ఆయనని పోటికి ఉండాలి అని కోరారు

కాని ఆయన ఆసక్తి చూపించడం లేదు.. ఈ సమయంలో ఓ కాపు నేత ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తి పోటికి వస్తారు అని తెలిసింది, కాని ఆయన కూడా పోటికి నిలువలేను అని అన్నారట, ఇక డాక్టర్ గా పేరు సంపాదించిన ఓ కుటుంబం నుంచి తండ్రి కొడుకులు ఇద్దరూ వైసీపీలో చేరుతారు అని అనుకుంటే ,వారి కుమారుడు జనసేనలో చేరారు. అయితే ఇక్కడ ఈసారి పోటికి బీజేపీ తరపున ఉన్న ఎంపీ కుమారుడు బరిలోకి దిగుతారు అని కొత్త వార్త వినిపిస్తోంది.

బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు తనయుడు జీవీకే రంగరాజును నరసాపురం నుంచి ఎంపీగా బరిలోకి దించేందుకు వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది వైసీపీ.. ఇక్కడ సీనియర్లు ఇప్పటికే మంతనాలు జరిపారు అని తెలుస్తోంది. అయితే బీజేపీ తరపున తన తండ్రి పోటీ చేయకపోతే ఆయన పోటీ చేస్తారు అని మాట ఇచ్చారు అని కూడా వార్తలు వస్తున్నాయి.. అలాగే ఇక్కడ కనుమూరి బాపిరాజు కాంగ్రెస్, గంగరాజు బీజేపీ, ఇక రఘురామకృష్ణంరాజు టీడీపీ తరపున పోటీ చేయనున్నారు.. వీరు అందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు. సో రాజకీయంగా ఈసీటు పై తీవ్ర చర్చ అయితే జరుగుతోంది. సామాజిక అంశాలు చూసినా అందరూ క్షత్రియులకు ఇక్కడ టిక్కెట్లు ఇస్తున్నారు.. సో జగన్ కూడా అందుకే ఇక్కడ రాజులకు టికెట్ ఇవ్వాలి అని చూస్తున్నారు.. మరి ఆఫ్యామిలీ వైసీపీ నుంచి పోటీ చేస్తే గెలుపు కచ్చితంగా తథ్యం అనే చెప్పవచ్చు.అంటున్నారు ఇక్కడ ప్రజలు.

Latest Updates

More...

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.