janampulse

ఏలూరులో వింత వ్యాధి… ఇంతకీ మిస్టరీ ఏంటీ..?

అప్పటివరకు అంతా బాగానే ఉన్నారు. ఒక్కొక్కరూ ఉన్నట్లుండి కళ్లుతిరిగి పడిపోవడం మొదలైంది. చూస్తుండగానే ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 200 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో చోటు చేసుకున్న ఘటన ఇది.

తొలుత ఏలూరు వన్ టౌన్లోని దక్షిణ వీదిలో కొంతమంది స్పృహతప్పి పడిపోయారు. కొద్దిసేపటికి శనివారపుపేట, ఆదివారపుపేట, అరుంధతిపేట, పడమరవీధి, కొత్తపేట, అశోక్ నగర్, తంగెళ్లమూడి, తాపీమేస్త్రీ కాలనీ, అరుంధతిపేట ప్రాంతాల్లోనూ జనం పిట్టల్లా రాలిపోయారు. దీంతో ఒక్కసారిగా కలకలం వాతావరణమంతా ఆందోళనకరంగా మారిపోయింది. వెంటవెంటనే ఆంబులెన్సులు వచ్చి బాధితులను ఆస్పత్రులకు తరలించాయి. అస్వస్థతకు గురైన వారిలో యువకులు, వృద్ధులు, చిన్నపిల్లలు కూడా ఉన్నారు. కొందరికి మూర్చ, కొందరికి వాంతులు, మానసిక ఆందోళనల లక్షణాలు కనిపించినట్లు డాక్టర్లు తెలిపారు. నిన్న అస్వస్థతకు గురైన 140 మందిని డాక్టర్లు డిశ్చార్జ్ చేశారు. ఐతే ఇవాళ మరో 100 మంది ఆస్పత్రుల్లో చేరారు. వీరిలో 46 మందికి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో 60 మంది ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరారు.

అసలేం జరిగింది..?

ఒకేసారి వందమందికి పైగా కళ్లుతిరిగి పడిపోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. దీనికి కారణమేంటో అటు అధికారులు గానీ.. ఇటు డాక్టర్లుగానీ చెప్పలేకపోతున్నారు. ఐతే నగరంలో సరఫరా అవుతున్న తాగునీరే దీనికి కారణమని అనుమానిస్తున్నారు. కొన్నిరోజులుగా  నీరు రంగుమారి వస్తోందని ఆరోపిస్తున్నారు. బాధితుల నుంచి బ్లడ్, యూరిన్ శాంపిల్స్ తీసుకున్న డాక్టర్లు వాటిని ల్యాబ్ కు పంపారు. స్థానికంగా సరఫరా అవుతున్న మంచినీటిని కూడా పరిశీలిస్తున్నారు.

స్పందించిన ప్రభుత్వం


ఘటన గురించి తెలిసిన వెంటనే సీఎం వైఎస్ జగన్ స్పందించారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనానికి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించేందుకు ఆస్పత్రిలో ఏర్పాట్లు చేసినట్లు ఆళ్లనాని.. సీఎంకు వివరించారు. విజయవాడలోనూ ప్రత్యేక వార్డు సిద్ధం చేసినట్లు తెలిపారు. విజయవాడ జనరల్‌ ఆసుపత్రి నుంచి పిల్లల వైద్యులు, జనరల్‌ ఫిజీషియన్‌, ఇతర స్పెషలిస్ట్ డాక్టర్లను హుటాహుటిన ఏలూరు వెళ్లారు.

ఒక్కొక్కరు క్రమంగా  కళ్లుతిరిగి పడిపోతుండటంతో గ్యాస్ లీకైందోమనని ఆందోళన చెందినట్లు స్థానికులు తెలిపారు. ఘటన తర్వాత ఏలూరు నగర వ్యాప్తంగా కలకలం రేగడంతో ప్రజలు మినరల్ వాటర్ ప్లాంట్లకు క్యూ కడుతున్నారు.

Recent News

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.