బీజేపిలోకి సుజానాచౌదరి బాబుకు ఊహించని షాక్

Sujana Chowdary joinig to BJP

ఏపీలో బీజేపీ బలోపేతం అవడానికి పొలిటికల్ ప్లాన్ సిద్దం చేస్తోంది, పార్టీ తరపున ఎమ్మెల్యేలు ఎంపీలు మాజీ ఎమ్మెల్యే ఎంపీలు ఎమ్మెల్సీలు మాజీలు రాజ్యసభ సభ్యులు ఎవరు పార్టీలో చేరాలి అని అనుకున్నా, వారిని కమలం పార్టీ ఆకర్షిస్తోంది. అందుకే కొన్ని పార్టీల నేతలు కూడా కేంద్రంలో మరో ఐదు సంవత్సరాలు అధికారంలో ఉంటుంది కాబట్టి బీజేపీలో చేరాలి అని భావిస్తున్నారు.

టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడుగా సుజనా చౌదరి పేరు సంపాదించుకున్నారు.. అలాగే కేంద్ర మంత్రి అయ్యారు, రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఇక ఆయన కూడా ఇప్పుడు బీజేపీలోకి అడుగులు వేయాలి అని చూస్తున్నారు. పైగా చంద్రబాబుపై ఆయన పలు సంచలన వ్యాఖ్యలు చేశారు..గత అయిదేళ్లలో టిడిపి ప్రభుత్వం ప్రజల అంచనాలను తగినట్లుగా రాష్ట్రపాలన చేయలేదని అందుకే ఓటమి వచ్చింది అని అన్నారు. జగన్ ప్రధాని నరేంద్రమోదీ గురించి సానుకూలంగా కామెంట్లు చేశారు సుజనా.

టీడీపీ వదలి వెళ్ళేది లేదంటూనే ఒకవేళ బీజేపీలోకి వెళ్తే చంద్రబాబుకు చెప్పే వెళ్తానని స్పష్టం చేసారు. అసలు నారా చంద్రబాబు నాయుడు ఏపీలో ఉనికి లేని పార్టీకి దగ్గరవ్వటం, అదే సమయంలో రాష్ట్రంలో మరో ఉనికి లేని పార్టీతో యుద్దం చేయటం తోనే టీడీపీ ఖర్మకాలి ఈ దుర్గతి పట్టిందని వ్యాఖ్యానించారు.. బాబును పక్కన ఉన్న కొందరు తప్పుదారి పట్టించారు అని ఆయన అన్నారు. ఇక ఆయన బీజేపీలోకి వెళ్లడం లేదు అని చెప్పడం లేదు, ఒకవేళ వెళితే కచ్చితంగా చంద్రాబుకి చెప్పి వెళతా అంటున్నారు.

గత అయిదేళ్లలో ఆశించిన స్థాయిలో పాలన జరగలేదనే విషయాన్ని కుండ బద్దలు కొట్టారు ఆయన… కొంత మంది ఎమ్మెల్యేల మీద రకరకాల ఆరోపణలు వచ్చినా, చంద్రబాబు వారికే తిరిగి టిక్కెట్లు ఇచ్చి పోటికి దించటం సైతం నష్టం చేసిందని చెప్పారు. సొంత ఎంపీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నా బాబు ఇంకా ఓటమికి కారణాలు వెతకడం ఏమిటి అని అందరూ ఆలోచన చేస్తున్నారు. చంద్రబాబుని సొంత సర్వేలు తప్పుదారిలోకి తీసుకువెళ్లాయి అని చాలా మంది తెలియచేశారు చివరకు అదే జరిగింది.

అసలు ఈవీఎంలలో తప్పు జరిగే అవకాశం లేదన్నారు ఆయన . జగన్ తన తెలివి తేటలతోనే వ్యాపారాల్లో సంపాదించారని, ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఆయన పై కేసుల గురించి పదేపదే ప్రస్తావించి రాజకీయాలు చేయటం సరైన పద్దతి కాదనే అభిప్రాయం తాను అప్పుడే వ్యక్తం చేసానన్నారు.ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ కేంద్రంతో వ్యవహరిస్తున్న తీరును సుజనా చౌదరి సమర్దించారు.. ప్రధాని నరేంద్ర మోదీపై సానుకూల వ్యాఖ్యలు చేసారు. ఆయన ఆలోచన తీరును సమర్ధించారు. ఇక తాము 2014 లో గెలవడానికి మోదీ పవన్ కలిసి రావడం కూడా ఒక కారణం అని ఆయన అన్నారు. పార్టీ తరపున అనేక విషయాలు చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లాము అని తెలియచేశారు.. కేంద్ర ప్రభుత్వం నుండి బయటకువద్దామని, అయితే ఎన్డీఏలో మాత్రం కొనసాగుదామని చెప్పినా చంద్రబాబు వినలేదన్నారు. ఎన్నికల ముందు బాబు వేసిన పొలిటికల్ స్టెప్స్ బీజపీతో యుద్దం చేయడం ఇవవ్నీ తెలుగుదేశం పార్టీకి ఓటమికి కారణం అయ్యాయి అని అన్నారు ఆయన.. ఇక ఇప్పటికే కేసుల విషయం కూడా సుజనా ఆలోచించి బీజేపీలో చేరాలి అని భావిస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి. మరి ఈ ప్రచారం ఎంత వరకూ వాస్తవమో చూడాలి.

Latest Updates

More...

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.