మోహన్ బాబుని జగన్ త్వరలో స్వీట్ న్యూస్

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ కోసం కష్టపడిన వారికి అందరికి పదవులు వస్తూనే ఉన్నాయి.. తాజాగా ఆయన వెంట ప్రతిపక్షంలో ఉన్న సమయంలో నుంచి పార్టీ కోసం కష్టపడిన వారికి పదవులు ఇస్తున్నారు.. నామినేటెడ్ పోస్టుల విషయంలో జగన్ సమన్యాయం చేశారు అనే చెప్పాలి. ఇక ఇప్పటికే ఎస్వీబీసీచైర్మన్ గా పృథ్వీ తాజాగా తెలుగు అకాడమి చైర్మన్ గా లక్ష్మీపార్వతిలకు సినిమా ఇండస్ట్రీ నుంచి అవకాశం ఇచ్చారు.

ఇక మరో కీలక నేత మిగిలారు. ఆయనే మంచు మోహన్ బాబు. సినిమాల్లో ఆయన విలక్షణ నటుడు. రాజకీయాల్లో మాత్రం ఆయన ఉన్నది ఉన్నట్లు మాట్టాడుతారు కాబట్టి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ కూడా చేయలేదు.. శ్రీకాళహస్తి నుంచి ఆయన పోటీ చేస్తారు అని వార్తలు వచ్చాయి. అది జరగలేదు, ఆయన కుమారులు కూడా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వలేదు. అయితే మంచు మోహన్ బాబు స్వయానా చంద్రబాబుకి దగ్గర చుట్టం. అన్న ఎన్టీఆర్ పిలుపుతో తెలుగుదేశంలో చేరారు మోహన్ బాబు. అయితే కొన్ని కారణాల వల్ల ఇటీవల పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు.

జగన్ కూడా స్వయానా దగ్గర బంధువు అవుతారు మంచు మోహన్ బాబుకి విష్ణుకి. ఆయన మొదటి కోడలి వల్ల అనేది తెలిసిందే.. మరి ఈ సమయంలో అందరికి పదవులు వస్తున్నాయి మంచు వారి ఇంటికి ఎలాంటి పదవి పిలుపు వెళ్లడం లేదు అని వార్తలు వినిపిస్తున్నాయి. మోహన్ బాబుకి స్వీట్ న్యూస్ త్వరలో ఇవ్వనున్నారట జగన్.. వచ్చే సంవత్సరం రాజ్యసభ ఎంపీలు వైసీపీకి మెజార్టీ వస్తాయి, దీంతో మొదటగా ఆయన పేరుని ఖరారు చేస్తారు అని తెలుస్తోంది .అందుకే మోహన్ బాబుకి ఏ పదవి ఇవ్వకుండా రిజర్వ్ లో పెట్టారు అని వార్తలు వినిపిస్తున్నాయి.

అంతేకాదు రాజకీయంగా చూసుకుంటే ఎన్టీఆర్ హయాంలో రాజ్యసభ సభ్యునిగా పనిచేసిన అనుభవం ఉంది మోహన్ బాబుకు. అందుకే మరోసారి ఆయనని హస్తినకు పెద్దల సభకు పంపాలి అని జగన్ భావిస్తున్నారట ..అందుకే ఎమ్మెల్సీ పదవుల విషయంలో కూడా మోహన్ బాబు పేరుని పలకడం లేదు వైసీపీ నేతలు, అదీ సంగతి.

Latest Updates

More...

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.