janampulse
Breaking News

మూడు నియోజకవర్గాలకు కొత్త ఇంఛార్జ్‌లు, ఆయనకు పదవి ఊహించలేదు

టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయాలు.. మూడు నియోజకవర్గాలకు కొత్త ఇంఛార్జ్‌లు. మాచర్లలో మాజీ ఎమ్మెల్యే కుమారుడికి అవకాశం కల్పించారు. విజయవాడ పశ్చిమం బాధ్యతలు ఎంపీ కేశినేని నానికి అప్పగించారు. విశాఖ దక్షిణం నుంచి గండి బాబ్జీకి ఛాన్స్.

TDP అధినేత  చంద్రబాబు  దూకుడు పెంచారు. పెండింగ్‌లో ఉన్న నియోజకవర్గాలకు ఇంఛార్జ్‌లను నియమిస్తున్నారు. కొద్దిరోజులుగా సమీక్షలు నిర్వహిస్తూ నేతల అభిప్రాయాలను సేకరించాక ఇంఛార్జ్‌లను నియమిస్తున్నారు. తాజా మరో మూడు నియోజకవర్గాలకు కొత్త బాస్‌లు వచ్చారు. బుధవారం ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ముగ్గుర్ని ప్రకటించారు. విశాఖ దక్షిణ నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గానికి జూలకంటి బ్రహ్మానంద రెడ్డి ఇంఛార్జ్‌లుగా నియమించారు. అలాగే విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి ఎంపీ కేశినేని నానిని సమన్వయకర్తగా నియమించారు. ఈ మూడు చోట్ల గమనిస్తే విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన నియామకం ఆసక్తికరంగా మారింది.

విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో టీడీపీ తరఫున మాజీ ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్‌ కుమార్తె పోటీ చేశారు. తర్వాత ఆమె రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ నేతలు బుద్దా వెంకన్న, నాగుల్‌ మీరా ఆ నియోజకవర్గ ఇన్‌చార్జి పదవిపై ఆశపెట్టుకున్నారు. కానీ నానికి బాధ్యతలు అప్పగించారు. నాగుల్‌ మీరాలను పార్టీ అధినేత చంద్రబాబు పిలిపించి మాట్లాడినట్లు తెలుస్తోంది.టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న బుద్దా వెంకన్నకు ఉత్తరాంధ్ర మూడు జిల్లాల పార్టీ కార్యకలాపాలు, వ్యవహారాలను పర్యవేక్షించే బాధ్యతను అధిష్ఠానం అప్పగించింది. బెజవాడలో నేతలు మధ్య కొద్దిరోజులుగా సమన్వయం లేకుండా పోయింది. కార్పొరేషన్ ఎన్నికల సమయంలో ఎంపీ నాని.. బుద్దా వెంకన్న, నాగుల్ మీరా, బొండా ఉమాల మధ్య విభేదాలు బయటపడ్డాయి.. పార్టీ కమిటీల విషయంలో కూడా అధిపత్యం కనిపించింది. దీంతో చంద్రబాబు సీరియస్‌గా తీసుకుని పాత కమిటీలను రద్దు చేశారు.. కేశినేనాని నానికి బాధ్యతలు అప్పగించారు.

మరోవైపు గుంటూరు జిల్లా మాచర్లపై కూడా చంద్రబాబు ఫోకస్ పెట్టారు. బలమైన అభ్యర్థికి అవకాశం ఇవ్వాలని భావించారు. అందుకే జూలకంటి బ్రహ్మారెడ్డిని నియమించారు.ఆయన తల్లి దుర్గాంబ గతంలో మాచర్ల ఎమ్మెల్యేగా చేశారు.. ఇప్పుడు మళ్లీ ఆ కుటుంబానికి అవకాశం ఇచ్చింది. అదే నియోజకవర్గానికి చెందిన చిరుమామిళ్ల మధు బాబుకు రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి పదవి ఇచ్చారు. ఇక విశాఖ దక్షిణ నుంచి 2019 ఎన్నికల్లో వాసుపల్లి గణేష్ టీడీపీ నుంచి విజయం సాధించారు.. ఆ తర్వాత వైఎస్సార్‌సీపీకి జై కొట్టారు. దీంతో మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీకి అవకాశం ఇచ్చారు.

Recent News

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.