
వాళ్లకు ఈ నెలాఖరు వరకు డెడ్‌లైన్…Chandrababu Naidu సీరియస్
కొన్ని జిల్లాల్లో 10 శాతానికి పైగా కమిటీల నియామకం ఇంకా జరగకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొన్ని చోట్ల టీడీపీ గ్రామ, మండల కమిటీల నియామకంలో జాప్యం జరిగింది. అధినేత చంద్రబాబు చెప్పినా నేతలు సీరియస్‌గా తీసుకోలేదు.
TDP అధినేత Chandrababu సొంత పార్టీ నేతలపై సీరియస్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో పార్టీ గ్రామ, మండల కమిటీల నియామకంలో జరగుతున్న జాప్యంపై మండిపడ్డారు. గురువారం జోనల్ ఇంఛార్జ్‌లతో సమీక్ష నిర్వహించారు. 25 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో పెండింగ్ లో ఉన్న గ్రామ, మండల కమిటీలకు అన్ని నియోజకవర్గాలకు పరిశీలకులుగా నియమించిన కార్యదర్శులు, కార్యనిర్వాహక కార్యదర్శులు కమిటీలు ఈ నెలాఖరు కల్లా పూర్తి చేసుకుని ప్రోగ్రామ్ కమిటీకి అందించాలని సూచించారు. కొన్ని జిల్లాల్లో 10 శాతానికి పైగా కమిటీల నియామకం ఇంకా జరగకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కమిటీల నియామకం పూర్తి చేయని నియోజకవర్గ ఇన్‌చార్జులు, పరిశీలకులు, పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు, సమన్వయకర్తలు, జోనల్ ఇన్‌చార్జులతో జనవరి మొదటివారంలో దీనిపై సమావేశం నిర్వహిస్తానని, ఈలోపు వీటి నియామకం పూర్తి కావాలని చంద్రబాబు స్పష్టం చేశారు. కమిటీలు పూర్తయ్యే వరకు ఆయా ప్రాంతాల్లోనే ఉండాలని ఆదేశించారు. ఇప్పటి వరకు ఇంకా కమిటీల ఏర్పాటు చేయకపోవడంతో చంద్రబాబు సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో కొన్ని చోట్ల టీడీపీ గ్రామ, మండల కమిటీల నియామకంలో జాప్యం జరిగింది. అధినేత చంద్రబాబు చెప్పినా నేతలు సీరియస్‌గా తీసుకోలేదు.. దీంతో చంద్రబాబు స్పందించారు. ఈ నెలాఖరులోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే కొద్దిరోజులుగా ఇటీవల మున్సిపల్ ఎన్నికలు జరిగిన నియోజకవర్గాల సమీక్ష కూడా నిర్వహించిన సంగతి తెలిసిందే.
Recent News
Latest Updates
- నారా రోహిత్, శ్రీ విష్ణు (హీరో మిత్రుల) చేతుల మీదుగా థౌసండ్ మూన్స్ ఇన్ఫ్రా ఘన ప్రారంభం
- పటారు పాలెం ప్రేమ కథ మూవీ రివ్యూ
- ప్రియురాలు కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి “విక్రమ్” సినిమా
- ఏపీ ప్రభుత్వంపై వర్మ సెటైర్లు..ఉప్మా, ఇడ్లీ, చీరల రేట్లు కూడా ఫిక్స్ చేస్తారా? YS Jagan
- చిచ్చురేపిన సోషల్ మీడియా పోస్ట్, తీవ్ర ఉద్రిక్తత…బాలయ్య ఇంటిని ముట్టడించిన వైసీపీ
- తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వు…జగన్ బెయిల్ రద్దుపై
- చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తున్నారా..?చంద్రబాబు లెక్క తప్పిందా..?
- లేఖ రాసిన సీఎం జగన్… ఏపీలో పింఛన్ తీసుకునేవారికి గుడ్‌న్యూస్