
పొగిడేస్తున్న తెలుగు తమ్ముళ్లు.. తమిళనాడు సీఎం స్టాలిన్ చాలా గ్రేట్
Tamil Nadu Cm Stalinను సోషల్ మీడియాలో పొగిడేస్తున్న తెలుగు తమ్ముళ్లు. ఎన్నో రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటే ఏపీలో మాత్రం మూలన పడేశారని
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ను టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా ఆకాశానికి ఎత్తేస్తున్నారు. చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారని.. తమ అధినేత చంద్రబాబు స్ఫూర్తితో పని చేస్తున్నారని కితాబిస్తున్నారు. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగు తమ్ముళ్లు పొగడటం ఏంటని ఆశ్చర్యపోతున్నారా.. దీని వెనుక ఓ ఆసక్తికరమైన కారణం ఉంది. తెలుగు తమ్ముళ్ల పొగడ్తల వెనుక కారణం సీఎం డాష్ బోర్డ్ ( సెంట్రల్ మానటరింగ్ సిస్టమ్). ఇటీవలే ముఖ్యమంత్రి స్టాలిన్ దీనిని లాంచ్ చేశారు. పాలనలో కీలకమైన అన్ని అంశాలను మానిటరింగ్ చేయొచ్చని ప్రభుత్వం చెబుతోంది.. నేరుగా ముఖ్యమంత్రి పర్యవేక్షిస్తారని.. ఇది మంచి ఆలోచన అంటోంది. ఈ విషయాన్ని తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియాలో ప్రస్తావిస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కూడా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎం డాష్ బోర్డు ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
చంద్రబాబును ఆదర్శంగా తీసుకొన్ని కొన్ని రాష్ట్రాలు ఇలా సీఎం డాష్ బోర్డును ఏర్పాటు చేస్తున్నాయని తెలుగు తమ్ముళ్లు ఆనందపడుతున్నారు. అందరి కంటే ముందే ఐదేళ్ల క్రితమే టీడీపీ ప్రభుత్వ పాలనలో చంద్రబాబు డాష్ బోర్డును ప్రారంభించారని గుర్తు చేస్తున్నారు. ఎంతోమందికి ఆదర్శంగా మారిన ఈ డాష్ బోర్డును ఏపీలో మాత్రం జగన్ ముఖ్యమంత్రి కాగానే మూలన పడేశారని ప్రభుత్వానికి చురకలంటించారు. ఈ సీఎం డాష్ బోర్డుతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని చెబుతున్నారు.
Recent News
Latest Updates
- నారా రోహిత్, శ్రీ విష్ణు (హీరో మిత్రుల) చేతుల మీదుగా థౌసండ్ మూన్స్ ఇన్ఫ్రా ఘన ప్రారంభం
- పటారు పాలెం ప్రేమ కథ మూవీ రివ్యూ
- ప్రియురాలు కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి “విక్రమ్” సినిమా
- ఏపీ ప్రభుత్వంపై వర్మ సెటైర్లు..ఉప్మా, ఇడ్లీ, చీరల రేట్లు కూడా ఫిక్స్ చేస్తారా? YS Jagan
- చిచ్చురేపిన సోషల్ మీడియా పోస్ట్, తీవ్ర ఉద్రిక్తత…బాలయ్య ఇంటిని ముట్టడించిన వైసీపీ
- తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వు…జగన్ బెయిల్ రద్దుపై
- చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తున్నారా..?చంద్రబాబు లెక్క తప్పిందా..?
- లేఖ రాసిన సీఎం జగన్… ఏపీలో పింఛన్ తీసుకునేవారికి గుడ్న్యూస్