janampulse
Breaking News

నారా లోకేశ్ సంచలన ఆరోపణలు… ‘వరదల్లో 39 మంది జలసమాధి అయ్యారు..’

CM Jaganపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. ఏపీలో ఇసుక అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుందని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ

ఏపీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. ఏపీలో ఇసుక అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుందని మండిపడ్డారు. ఇసుక అక్రమ తవ్వకాల కారణంగానే ఇటీవల సంభవించిన వరదల్లో 39 మంది జలసమాధి అయ్యారని ఆయన ఆరోపించారు. అన్నమయ్య ప్రాజెక్టు వరదల కారణంగా మరణించిన వారి కుటుంబాలు తేరుకోక ముందే.. ఇసుక ట్రాక్టర్లు గ్రామాల్లో అలజడి సృష్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ” వైసీపీ ఇసుకాసురుల అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. అన్నమయ్య ప్రాజెక్ట్ బాధితుల కన్నీళ్లు ఆరకముందే గ్రామాల్లో ఇసుక ట్రాక్టర్లు క్యూ కట్టాయంటే వైఎస్ జగన్ గారికి జనం కంటే ధనమే ముఖ్యమని అర్థం అవుతోంది. వైసీపీ నాయకుల ధనదాహానికి 39 మంది జల సమాధి అయ్యారు. 12 గ్రామాలు నీట మునిగాయి. రూ.1721 కోట్ల నష్టం వాటిల్లింది..” అని నారా లోకేశ్  ట్వీట్ చేశారు.

బాధితులకు కనీస న్యాయం జరగకముందే కడప జిల్లా నందలూరు మండలం, ఆడవూరు క్వారీలో ఇసుక విక్రయాలు ప్రారంభించారని నారా లోకేశ్ ఆరోపించారు. జల ప్రళయానికి కారణమైన ఇసుక మాఫియాని కట్టడి చెయ్యాల్సిన ప్రభుత్వమే వారికి అండ నిలవడం బాధాకరమన్నారు. ఈ మేరకు వాటికి సంబంధించిన ఫొటోలను ఆయన ట్వీట్టర్‌లో షేర్ చేశారు.

Recent News

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.