బీజేపీలోకి టీడీపీ ఎమ్మెల్యే

TDP MLA Joining in to BJP

బీజేపీ ఏపీలో పాగా వేసేందుకు పక్కా ప్రణాళికలు వేసింది. ముఖ్యంగా చంద్రబాబు కోటరీలో వ్యక్తులని తన పార్టీలోకి చేర్చుకోవాలి అని భావిస్తోంది. అలాంటి వ్యూహలతో తెలుగుదేశం పార్టీని ఇప్పుడు ఏపీలో దెబ్బ తీస్తోంది అని చెప్పాలి. బీజేపీ నేతలతో టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ భేటీ అయ్యారు. దీంతో ఆయన పార్టీ మారుతారు అని వస్తున్న వార్తల్లో నిజం ఉంది అంటున్నారు పార్టీ నేతలు. ఇక ఆయనతో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా కాషాయం కండువా కప్పుకునేందుకు సిద్దం అయ్యారట.. అయితే ఇప్పుడు రేపల్లె ఎమ్మెల్యే విషయం మాత్రం బాబుకు కాస్త షాకింగ్ విషయం అని చెప్పాలి.

ఈ ఎమ్మెల్యేలను ఎంపీ గరికపాటి రామ్మోహనే బీజేపీ నేతల దగ్గరికి తీసుకెళ్లినట్టు సమాచారం. అనగాని సత్యప్రసాద్ రేపల్లె నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.. తెలుగుదేశం పార్టీలో బాబుకు నమ్మకస్తుడిగా ఉన్నారు.ఎంపీ గరికపాటి రామ్మోహన్తోపాటు సుజనా చౌదరి, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్ ఇటీవలే టీడీపీకి గుడ్ బై చెప్పి బీజేపీకి గూటికి చేరారు. దీంతో ఏపీలో టీడీపీ నేతలు, కార్యకర్తల వలసలు జోరందుకుంది. పార్టీలో పెద్ద పెద్ద పదవులు అనుభవించిన నేతలు కూడా ఇతర పార్టీల్లోకి క్యూ కడుతున్నారు. ఇక ఆయన తెలుగుదేశం వీడి బీజేపీలో చేరుతారని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ విషయంలో చంద్రబాబు కూడా ఆ నేతలపై డౌట్లోనే ఉన్నారు.

అటు నందమూరి కుటుంబంతో అత్యంత సాన్నిహిత్య సంబంధాలున్న నేతలు కూడా కమలం తీర్థం పుచ్చుకునేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. చాలా మంది నేతలు వైసీపీలోకి వెళ్తే మళ్లీ వర్గపోరు కేడర్ సమస్య అని భావిస్తున్నారు… అందుకే బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారు.. అలాగే ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరుకు చెందిన ప్రముఖ నేత కూడా బీజేపీలో చేరారు. మరోవైపు చాలా మంది టీడీపీ నేతలు తమకు టచ్లో ఉన్నారని ఏపీ బీజేపీ నేతలు బహిరంగంగానే ప్రకటనలు చేశారు. మరి సత్యప్రసాద్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో చూడాలి. ఒకవేళ పార్టీ మారితే మాత్రం ఫిరాయింపు లెక్కన జగన్ సర్కారు స్పీకర్ ద్వారా వేటు వేస్తారో లేదో కూడా చూడాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.

Recent News

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.