janampulse
Breaking News

వైసీపీలోకి సీనియర్ టీడీపీ ఎంపీ – డేట్ ఫిక్స్డ్

TDP MP Join to YSRCP

ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ ను బలహీనం చేయాలనే లక్ష్యంతో ఆ పార్టీ గుర్తు మీద గెలిచిన సుమారు ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలను ,ఒక ఎంపీని పదవులు ,పోర్టులు ఆశచూపించి పచ్చ కండువా కప్పాడు చంద్రబాబు .అంతే కాకుండా ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో భాగంగా గత మూడున్నర దశాబ్దాలుగా పార్టీకి అండగా ఉన్నవారిని ..పార్టీ కోసమే నిత్యం పని చేసిన సీనియర్ నేతలను కాదు అని మరి వైసీపీ పార్టీ నుండి పదవుల కోసం అధికారం కోసం పార్టీ మారిన నలుగురు ఎమ్మెల్యేలకు ఏకంగా మంత్రి పదవులు ఇచ్చాడు .ఎందుకంటే ఎప్పటి నుండో పార్టీ కోసం కష్టపడుతున్న తమను కాదు అని పార్టీ మారిన వారికీ మంత్రి పదవులు ఇచ్చారు అని మోస్ట్ మోస్ట్ సీనియర్ నాయకులు అయిన బొజ్జల గోపాలకృష్ణ ,చింతమనేని ప్రభాకర్ ,పయ్యావుల కేశవ్ ,బొండా ఉమా టీడీపీ అధిష్టానం మీద తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే .అయితే ఇక్కడే చంద్రబాబు శివప్రసాద్ ను పోమ్మనేలేక పోగబెడుతూ టీడీపీ ఎమ్మెల్సీ అయిన బుద్ధా వెంకన్న ద్వారా శివప్రసాద్ మీద దాడికి ఉసిగొల్పాడు .ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్సీ అయిన బుద్దా వెంకన్న దళిత సామాజిక వర్గ నేత అయిన శివప్రసాద్ మీద మాటల దాడికి దిగాడు .దీంతో ఆయన మాట్లాడుతూ “దళితులకు అన్యాయం జరగలేదు అని ..శివప్రసాద్ అధికారాన్ని అడ్డుపెట్టుకొని భూకుంభ కోణాలకు ,అక్రమాలకు పాల్పడుతున్నాడు అంటూ విమర్శల అస్త్రం ఎక్కి పెట్టేశాడు .

ఇక్కడే ఆ రాష్ట్ర దళిత సామాజిక వర్గ నేతలు టీడీపీ అధిష్టానం మీద ,ఎమ్మెల్సీ వెంకన్న మీద విరుచుకుపడుతున్నారు .దళితుడైన ఎంపీ ని పార్టీ నుండి సాగనంపడానికి బాబు కుట్రలు పన్నుతున్నారు అని ..బ్యాంకు లకు వందల కోట్లను నామం పెట్టిన కేంద్ర మంత్రి సుజన చౌదరి ,వందల ఎకరాలను అప్పనంగా ఆక్రమించిన రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావును విమర్శించకుండా కేవలం దళితుడైన శివప్రసాద్ మీద మాటల దాడికి దిగడం దళితులను అవమానపరచడమే అని ..టీడీపీ లో దళితులకు జరుగుతున్నా అవమానాలకు నిరసనగా ..దళితుల పట్ల బాబు వ్యవహరిస్తోన్న తీరును వ్యతిరేకిస్తూ టీడీపీ కి గుడ్ బై చెప్పి చిత్తూరు జిల్లాకు చెందిన దళిత టీడీపీ నేతలందరూ ఎంపీ నాయకత్వంలో వైసీపీలో చేరాలని ..ప్రస్తుతం న్యూజిల్యాండ్ పర్యటనలో ఉన్న వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఏపీకి తిరిగివచ్చిన తర్వాత మంచి రోజు చూసుకొని వైసీపీలో చేరాలని ఎంపీ శివప్రసాద్ తన అనుచరవర్గంతో ..దళిత సామాజిక వర్గ నేతలతో సమావేశమై నిర్ణయం తీసుకున్నారు అని ..జగన్ వచ్చిన తర్వాత చిత్తూరు లో ఒక బహిరంగ సభ ను ఏర్పాటు చేసి వైసీపీ తీర్ధం పుచ్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఎంపీ శివప్రసాద్ వర్గం అంటున్నారు .ఇప్పుడు వార్తలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తుంది .

Recent News

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.