janampulse

త్వరలో గవర్నర్‌గా టీడీపీ సీనియర్ నేత

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుల్లో మోత్కుపల్లి నర్సింహులు ఒకరు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర మోత్కుపల్లిది. అయితే తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ దీనావస్థలో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మోత్కుపల్లికి మంచి పదవి ఇప్పించి గౌరవించాలని టీడీపీ అధినేత చంద్రబాబు చాలా సార్లు ప్రయత్నం చేసారు కానీ ఎందుకో కుదరలేదు. గతంలోనే మోత్కుపల్లికి గవర్నర్ పదవి వస్తుందని వార్తలు వచ్చాయి. కానీ ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఆయన ఆశ నెరవేరలేదు. 
 
ఇప్పుడు తాజాగా మరోసారి ఆయన గవర్నర్ కానున్నారనే వార్తలు బలం పుంజుకున్నాయి. దీనికి కారణం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టాక తొలిసారిగా హైదరాబాద్ కు వచ్చిన వెంకయ్యనాయుడ్ని తెలంగాణా టీడీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఉపరాష్ట్రపతి పదవికి వన్నె తెస్తారని చెపుతూ వెంకయ్య తెలుగు వారందరికీ గర్వకారణంగా నిలిచారని పొగడ్తలు కురిపించారు. 
 
వాళ్ల పొగడ్తలకు పడిపోయారో లేక నిజంగానే తనకు తెలిసిన విషయం చెప్పారో కానీ వెంకయ్య నాయుడు త్వరలోనే మోత్కుపల్లికి గవర్నర్ పదవి రావడం ఖాయమని వ్యాఖ్యానించారు. వెంకయ్య ఎంత క్లారిటీ లేకుంటే ఈ విధంగా చెపుతారని మీడియా ప్రతినిధులు గుసగుసలాడుకుంటున్నారు. మరి వెంకయ్య కామెంట్లను బట్టి చూస్తే ఇన్నాళ్లకు కల నెరవేరి మోత్కుపల్లికి గవర్నర్ పదవి రావడం ఖాయంగా కనిపిస్తోంది.

Recent News

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.