
Breaking News
రామ్‌నాధ్ కోవింద్ సీఎం కేసీఆర్ కు తాత చుట్టమా!?
బీజేపీ ప్రతిపాదించిన రాష్ట్రపతి అభ్యర్ధి రామ్‌నాథ్ కోవింద్ కు తెలంగాణా సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బేషరతుగా మద్ధుతు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా హైదరాబాద్ వచ్చిన కోవింద్ సీఎం కేసీఆర్ సన్మానించి, ఆయన రాష్ట్రపతి పదవికి వన్నె తెస్తారని వెల్లడించారు. అయితే తెలంగాణాలో అతిపెద్ద పార్టీ అయిన టీఆర్ఎస్ కోవింద్ కు మద్ధతు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీకి మింగుడు పడటం లేదు.
తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ వి. హనుమంతరావు ఈ విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. కోవింద్ ఏదో తాతల, ముత్తాల నుంచి చుట్టం అన్నట్టుగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని తన అక్కసును వెల్లగక్కారు. కాంగ్రెస్ రాష్ట్రపతి అభ్యర్ధి మీరా కుమార్ ఫోన్ చేస్తే సీఎం కేసీఆర్ స్పందించలేదని హన్మంతన్న ఆరోపించారు. అక్కడితో కూడా ఆగకుండా ఊరూరూ తిరిగి జనాన్ని ఏకం చేసిన కేసీఆర్ ను గద్దె దించుతామని కూడా చెప్పాడు. అయినా పతనావస్థలో ఉన్న కాంగ్రెస్ కు ఎవరైనా మద్ధతు ఇస్తారా? హన్మంతన్నా..జర సోచాయించరాదే.
Recent News
Latest Updates
- నారా రోహిత్, శ్రీ విష్ణు (హీరో మిత్రుల) చేతుల మీదుగా థౌసండ్ మూన్స్ ఇన్ఫ్రా ఘన ప్రారంభం
- పటారు పాలెం ప్రేమ కథ మూవీ రివ్యూ
- ప్రియురాలు కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి “విక్రమ్” సినిమా
- ఏపీ ప్రభుత్వంపై వర్మ సెటైర్లు..ఉప్మా, ఇడ్లీ, చీరల రేట్లు కూడా ఫిక్స్ చేస్తారా? YS Jagan
- చిచ్చురేపిన సోషల్ మీడియా పోస్ట్, తీవ్ర ఉద్రిక్తత…బాలయ్య ఇంటిని ముట్టడించిన వైసీపీ
- తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వు…జగన్ బెయిల్ రద్దుపై
- చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తున్నారా..?చంద్రబాబు లెక్క తప్పిందా..?
- లేఖ రాసిన సీఎం జగన్… ఏపీలో పింఛన్ తీసుకునేవారికి గుడ్‌న్యూస్