
‘దళితబంధు’ లబ్దిదారులకు అదిరిపోయే శుభవార్త…KCR సర్కార్ కీలక నిర్ణయం…
దళితబంధు లబ్దిదారుల ప్రత్యేక ఖాతాల్లో జమ చేసిన రూ.10లక్షల సొమ్ముకు వడ్డీ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై కీలక ఆదేశాలు జారీచేసింది.
రాష్ట్రంలో దళితబంధు పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. యూనిట్లు మంజూరయ్యే వరకు ప్రత్యేక ఖాతాల్లోని నగదుపై వడ్డీ జమ చేయనుంది. లబ్ధిదారుల పేరిట ఖాతాల్లో నిధులు ఉన్నందున ఆ వడ్డీపై పూర్తి హక్కులు వారికే లభించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మూడు నెలల క్రితమే ఖాతాల్లో నిధులు జమచేసినందున తాజా నిర్ణయంతో ఒక్కో లబ్ధిదారుకు కనీసం రూ.8-9వేల వరకు వడ్డీరూపంలో అందుతాయని సంక్షేమవర్గాలు భావిస్తున్నాయి.
ఒక్కో దళిత కుటుంబానికి రూ.10లక్షలతో స్వయం ఉపాధి కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం దళిత బంధు ప్రారంభించింది. హుజూరాబాద్ నియోజకవర్గంతో పాటు సీఎం దత్తత గ్రామం వాసాలమర్రిలో పథకాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. హుజూరాబాద్ పరిధిలో దాదాపు 20వేల మంది వరకు లబ్ధిదారులు ఉంటారని అంచనా వేసిన ప్రభుత్వం వీరిలో ఇప్పటికే 18వేల మందికి రూ.10లక్షల చొప్పున రూ.1800కోట్లు జమ చేసింది. వాసాలమర్రిలో 76 మంది ఉంటారని అంచనా వేయగా.. ఇప్పటికే 66 ఖాతాల్లో నగదు వేసింది. బ్యాంకుల్లో లబ్ధిదారుల పేరిట ప్రత్యేకంగా దళితబంధు ఖాతాలు తెరిచి ఈ నిధులు జమచేసింది. అయితే యూనిట్లు ఎంపిక చేసుకుని, కలెక్టర్ల ఆధ్వర్యంలో అనుమతి పొందేవరకు లబ్ధిదారులు ఖాతాల నుంచి నేరుగా నిధులు తీసుకోకుండా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ప్రస్తుతం 60మంది లబ్ధిదారులు మాత్రమే ఈ పథకం కింద ట్రాక్టర్లు, కార్ల యూనిట్లు తీసుకుని స్వయం ఉపాధి పొందుతున్నారు. మిగతా లబ్ధిదారులకు విభిన్న యూనిట్లపై శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. యూనిట్లు మంజూరయ్యే వరకు ఆయా ఖాతాల్లో నిధులపై బ్యాంకులు సాధారణ వడ్డీ జమ చేయాల్సి ఉంటుంది.
Recent News
Latest Updates
- నారా రోహిత్, శ్రీ విష్ణు (హీరో మిత్రుల) చేతుల మీదుగా థౌసండ్ మూన్స్ ఇన్ఫ్రా ఘన ప్రారంభం
- పటారు పాలెం ప్రేమ కథ మూవీ రివ్యూ
- ప్రియురాలు కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి “విక్రమ్” సినిమా
- ఏపీ ప్రభుత్వంపై వర్మ సెటైర్లు..ఉప్మా, ఇడ్లీ, చీరల రేట్లు కూడా ఫిక్స్ చేస్తారా? YS Jagan
- చిచ్చురేపిన సోషల్ మీడియా పోస్ట్, తీవ్ర ఉద్రిక్తత…బాలయ్య ఇంటిని ముట్టడించిన వైసీపీ
- తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వు…జగన్ బెయిల్ రద్దుపై
- చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తున్నారా..?చంద్రబాబు లెక్క తప్పిందా..?
- లేఖ రాసిన సీఎం జగన్… ఏపీలో పింఛన్ తీసుకునేవారికి గుడ్న్యూస్