
సీఎం బెయిల్ రద్దుపై కీలక పరిణామం…YS Jagan కు హైకోర్టు నోటీసులు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. బెయిల్ రద్దు పిటిషన్‌పై..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం జగన్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై సోమవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో సోమవారం హైకోర్టులో విచారణ జరగగా.. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీఎం జగన్‌పై 11 చార్జ్‌షీట్లు ఉన్నాయని ఎంపీ రఘురామ తరఫున న్యాయవాది కోర్టుకి తెలిపారు. సీఎం జగన్ బెయిల్ రద్దు చేసి 11 చార్జ్‌షీట్లను విచారించాలని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. అయితే, జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌ను సీబీఐ కోర్టు కొట్టివేయడంతో ఎంపీ రఘురామ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది. సీఎం జగన్‌కు నోటీసులు జారీ చేసిన హైకోర్టు.. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. సీఎం జగన్ బెయిల్ రద్దు పటిషన్‌పై తెలంగాణ హైకోర్టు 2 వారాల తర్వాత మరోసారి విచారణ జరపనుంది. దీనిపై ఎలాంటి తీర్పు వస్తుందోనని అందిరిలోనూ ఉత్కంఠ నెలకొంది.
Recent News
Latest Updates
- నారా రోహిత్, శ్రీ విష్ణు (హీరో మిత్రుల) చేతుల మీదుగా థౌసండ్ మూన్స్ ఇన్ఫ్రా ఘన ప్రారంభం
- పటారు పాలెం ప్రేమ కథ మూవీ రివ్యూ
- ప్రియురాలు కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి “విక్రమ్” సినిమా
- ఏపీ ప్రభుత్వంపై వర్మ సెటైర్లు..ఉప్మా, ఇడ్లీ, చీరల రేట్లు కూడా ఫిక్స్ చేస్తారా? YS Jagan
- చిచ్చురేపిన సోషల్ మీడియా పోస్ట్, తీవ్ర ఉద్రిక్తత…బాలయ్య ఇంటిని ముట్టడించిన వైసీపీ
- తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వు…జగన్ బెయిల్ రద్దుపై
- చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తున్నారా..?చంద్రబాబు లెక్క తప్పిందా..?
- లేఖ రాసిన సీఎం జగన్… ఏపీలో పింఛన్ తీసుకునేవారికి గుడ్న్యూస్