రోజాకు జగన్ ఫోన్ కాల్ అమరావతి రావాలని ఆదేశం కీలక పదవి

jagan-roja

వైసీపీ అధికారంలోకి వస్తే జగన్ వెంటనే సీఎం అయితే ఎమ్మెల్యే రోజాకు మంత్రి పదవి ఇస్తారు అని అందరూ భావించారు.. కాని తొలి కేబినెట్ లో జగన్ మాత్రం రోజాకు మంత్రి పదవి ఇవ్వలేదు, అయితే పలు సామాజిక వర్గాల వారికి న్యాయం చేయాలి అని జగన్ భావించి అవకాశం కల్పించలేదు, అయితే మలివిడత కేబినెట్ లో కచ్చితంగా రోజాకు మంత్రి పదవి ఖాయం అని చెప్పకనే జగన్ చెప్పారు.. అయితే ఎమ్మెల్యే రోజాపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. టీడీపీ సోషల్ మీడియా కూడా ఇంత కష్టపడిన రోజాకు జగన్ చివరకు ఏమీ ఇవ్వలేదు అని విమర్శలు చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ మీడియా ముందు యాక్టీవ్ గా ఉన్న రోజా, మూడు రోజులుగా కనిపించడం లేదు. ఈంతో మీడియా కూడా ఆమె అలకబూనారు అని వార్తలు వదులుతోంది.. కాని జగన్ మాత్రం ఆమెకు మంచి పదవి ఇచ్చేందుకు సిద్దం అయ్యారు అని తెలుస్తోంది.

తాజాగా సీఎం వైయస్ జగన్ ఎమ్మెల్యే రోజాకు ఫోన్ చేసి అమరావతి రావాల్సిందిగా కోరడంతో రోజా హైదరాబాద్ నుంచి హుటాహుటిన బయలుదేరి వెళ్లినట్టు తెలుస్తుంది. ఇక రోజాకు ఇప్పుడు స్టేట్ లో మంత్రి పదవి రాకపోయినా ఆమెకు ఓ కీలక పదవి ఇవ్వాలి అని జగన్ డిసైడ్ అయ్యారట.. ఆమెకు మంత్రి పదవి దక్కకపోడంతో రాష్ట్ర మహిళా చైర్ పర్సన్ పదవి ఇచ్చే యోచనలో ఆయన ఉన్నారని, అయితే దీనిపైనే విజయసాయి రెడ్డితో కూడా జగన్ చర్చలు నడుపుతున్నారని ఒకపక్క ఎమ్మెల్యేగా ఉంటూ చైర్ పర్సన్ గా ఉండొచ్చో లేదో అన్న దానిపైనే కసరత్తులు చేస్తున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. మొత్తానికి మా రోజమ్మకు ఇకనైనా మంచి పదవి వస్తుంది అని అంటున్నారు. అయితే జగన్ నేరుగా ఆమెని అడగాలి అని డిసైడ్ అయ్యారట, ఆర్టీసీ చైర్మన్ లేదా మహిళా చైర్ పర్సన్ పదవి ఈ రెండింటిలో ఆమె కోరిక ప్రకారం పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Latest Updates

More...

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.